సినీ ఆర్టిస్ట్‌ అవుతాననుకోలేదు : రావు రమేష్‌

By Srikanya

Rao Ramesh
నిడదవోలు : తాను సినీ ఆర్టిస్ట్‌నవుతానని ఎప్పుడూ అనుకోలేదని ప్రముఖ సినీనటుడు, విలన్‌పాత్రధారి రావు గోపాలరావు తనయుడు రావు రమేష్‌ అన్నారు. వెంకటేశ్వర ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్ర షూటింగ్‌ మండలంలోని తిమ్మరాజుపాలెం కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలో జరుగుతోంది. ఈ చిత్రంలో హీరో అల్లరి నరేష్..నిర్మాత అంబికా కృష్ణ..దర్శకుడు ఇ.సత్తిబాబు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో రావు రమేష్ మాట్లాడారు.

నా తండ్రి రావుగోపాలరావుకు కూడా తనను సినీ పరిశ్రమలోకి తీసుకురావాలనే ఆలోచన ఉండేది కాదన్నారు. తన తండ్రిగోపాలరావు 1994లో మృతి చెందితే తాను 2008లో అంటే 14 ఏళ్ల అనంతరం సినీ పరిశ్రమలో అడుగు పెట్టానన్నారు. సినీ పరిశ్రమలో కష్టపడితే వారసత్వాలతో పనిలేదని గుర్తింపు దానికదే వస్తుందన్నారు. తాను, గిరిబాబు తనయుడు రఘుబాబు ఒకేసారి సినీరంగ ప్రవేశం చేశామన్నారు.

2008లో నాతొలి చిత్రం గమ్యం కాగా, నాకు సినీరంగంలో టర్నింగ్‌ పాయింట్‌ ఇచ్చింది మాత్రం కొత్త బంగారు లోకం చిత్రమన్నారు. ఇంకా ఇటీవల కాలంలో అత్తారింటికి దారేది, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, మగధీర వంటి చిత్రాలు కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయన్నారు. తాను ఇంత వరకు సుమారు 60 చిత్రాల్లో నటించానన్నారు. మంచి క్యారెక్టర్‌లు వస్తే ఇంకా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. పలు ఆఫర్లు కూడా వచ్చి ఉన్నాయన్నారు.

మంచి దర్శకుల వద్ద నటించేందుకు నాకు అవకాశాలు వచ్చాయని, ఒక్కొక్క దర్శకుని నుంచి ఒక్కో మంచి విషయాన్ని తెలుసుకున్నానన్నారు. తనకు రెండు అవార్డులు వచ్చాయని, అయితే సినీ పరిశ్రమలో ఆకలితో ఉన్న సమయంలో కళాకారులను గుర్తించరని, మంచి స్థాయికి ఎదిగిన అనంతరం గుర్తిస్తారన్నారు. అందువల్ల అవార్డుల కోసం తాను అంతగా తపించనన్నారు. కష్టపడితే గుర్తింపు అనేది దానికదే రావడంతో పాటు ప్రేక్షకులు గుర్తించి అభిమానిస్తారన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X