విధ్వంసం అంటూ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన రావు రమేష్
సోషల్ మీడియా యుగంలో ఏది నిజమో ఏది అబద్దమే తేల్చుకోలేము. ఒక్కోసారి అది నిజమేనేమో అనేంతగా నమ్మిస్తాయి. ఆ కామెంట్స్ చేసింది సదరు వ్యక్తే అనేట్టుగా ఉంటాయి. అయితే ఇవి ఒక్కోసారి సదరు సెలెబ్రిటీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తాయి. అంతా తేరుకోని చూసేసరికి విషయం చేజారి పోతుంది. తాజాగా అలాంటి స్థితే విలక్షణ నటుడు రావు రమేష్‌కు ఎదురైంది. అయితే ఆయన తెలివిగా వెంటనే స్పందించి నష్ట నివారణ చర్యలు ప్రారంభించాడు. అసలు ఇంతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

అరుదైన నటుడు..
రావు గోపాలరావు వారసుడిగా రావు రమేష్‌కు వెండితెరపై అంతగా సులువుగా అవకాశాలేమీ దక్కలేదు. చిన్న చిన్న పాత్రలను చేసుకుంటూ మోస్ట్ వాంటెడ్ యాక్టర్‌గా ఎదిగాడు. టాలీవుడ్‌లో బిజియెస్ట్ ఆర్టిస్ట్‌గానే కాకుండా పెయిడ్ ఆర్టిస్ట్‌గానూ ఫేమస్ అయ్యాడు. ప్రతీ పాత్రలో తనదైన శైలిని చూపిస్తాడు.

వైరల్ ట్వీట్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రముఖ నటుడు రావు రమేష్ ఖాతా మీదు ఓ ట్వీట్ వైరల్ అయింది. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే.. ‘మొదటి విధ్వంసం! చాలా బాధపడ్డా.. మన ఆంధ్రప్రదేశ్ ఎటు వెళ్తుందో అని. ఇప్పటికైనా మారతారని ఆశిస్తూ - మీ రావు రమేష్' అని ఉంది.

క్లారిటీ ఇచ్చిన నటుడు..
ఆ ట్వీట్ తాను చేయలేదని, అసలు తనకు సోషల్ మీడియా ఖాతాలేవీ లేవని రావు రమేష్ స్పష్టం చేశాడు. ఈ విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడాడు.
Recommended Video

ఏదైనా ఉంటే..
రావు రమేష్ స్పందిస్తూ.. ‘నాకు సోషల్‌మీడియాలో ఎటువంటి ఖాతాలూ లేవు. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్.. వేటిల్లోనూ నాకు అకౌంట్ లేదు. ఈ రోజు నా పేరు మీద ఎవరో ట్విటర్‌లో పోస్టులు పెట్టారు. ఆ పోస్టులకు నాకు ఎటువంటి సంబంధమూ లేదు. దయచేసి వాటిని నమ్మకండి. ఏదైనా ఉంటే పత్రికా ముఖంగా నేనే తెలియజేస్తాను. నా పేరు మీద ఇలా చేస్తున్న వారి మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టబోతున్నాన'ని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











