Rao Ramesh మేకప్ మెన్ మృతి.. ఆ ఫ్యామిలీకి స్టార్ హీరో రేంజ్ లో ఆర్థిక సహాయం!

సినిమా ఇండస్ట్రీలో పైకి కనిపించే చాలామంది ఆర్టిస్టుల జీవితాల్లో కలర్ఫుల్ గానే ఉంటాయి కానీ వారి వెనకాల కష్టపడి పనిచేసే వారి జీవితాలు మాత్రం ఊహించని విధంగా ఉంటాయి. ముఖ్యంగా చిన్నస్థాయి టెక్నీషియన్స్ అయితే ఇండస్ట్రీలో పనులు ఉన్నన్ని రోజుల్లోనే హ్యాపీగా ఉంటారు. ఇక ఏ రోజైనా షూటింగ్ ఆగిపోతే మాత్రం రోజు గడవడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే అలాంటివారికి ప్రముఖను నటీ నటులు అప్పుడప్పుడు సహాయం అందిస్తున్న విధానం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

ఈ క రీసెంట్గా ప్రముఖ నటుడు రావు రమేష్ కూడా తన దగ్గర ఎప్పటినుంచో పనిచేస్తున్న ఒక మేకప్ మెన్ ఫ్యామిలీకి సహాయపడిన విధానం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఏదో ఒకటో రెండు లక్షలు ఇచ్చి ఆయన తప్పుకోకుండా వారికి అవసరమైనంత ఆర్థికంగా సహాయం చేసి అండగా నిలిచారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ పాత్రలతో ఎంతగానో గుర్తింపు అందుకున్న రావు గోపాల్ రావు తనయుడు రావు రమేష్ ప్రస్తుతం పాజిటివ్ నెగిటివ్ రోల్స్ అంటూ తేడా లేకుండా బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా వీలైనంతవరకు క్రమశిక్షణతో ఆయన మంచి అవకాశాలను అందుకుంటున్నారు. కేవలం నటుడిగానే కాకుండా ఆయన వ్యక్తిగతంగాను చాలా మంచివారు అని చాలామంది నటీనటులు పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు.

Actor Rao Ramesh financial help to personal makeup man family

ఇక రీసెంట్ గా రావు రమేష్ ఎంత మంచి వారో మరోసారి అర్థమయింది. ఇటీవల రావు రమేష్ దగ్గర ఎప్పటినుంచో పని చేస్తున్న పర్సనల్ మేకప్ మెన్ మృతి చెందాడు. ఇక అతను మృతితో అతని కుటుంబం ఒక్కసారిగా అనాధగా మారిన పరిస్థితి ఏర్పడింది. రోజు గడవడమే కష్టం అనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా కుటుంబ పెద్దదిక్కు కూడా మరణించడంతో వారు తీవ్ర స్థాయిలో మనోవేదనకు గురి అయ్యారు. అయితే రావు రమేష్ మాత్రం వారికి ఆర్థికంగా సహాయం చేసి అండగా నిలిచారు. ఏకంగా 10 లక్షల రూపాయలు అందజేసి కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించారు. ఏదేమైనా కూడా ఆయన ఆ స్థాయిలో సహాయం చేయడం అనేది గొప్ప విషయం అంటూ అతను రియల్ హీరో అని కూడా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X