‘ఆర్‌ఎక్స్ 100’ అందరినీ రెచ్చగొడుతుంది: రావు రమేష్
కేసీడబ్ల్యూ బ్యానర్‌పై కార్తికేయ, పాయల్ రాజపుత్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆర్‌ఎక్స్ 100'. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రావురమేష్, సింధూర పువ్వు రామ్‌కీ కీలక పాత్రలు పోషించారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా గురించి రావు రమేష్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
ఇన్ క్రెడిబుల్ లవ్ స్టోరి అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక.... ఇది వంద శాతం యాక్ట్ అయిన టైటిల్ అని రావు రమేష్ తెలిపారు. దర్శకుడు అజయ్ భూపతి కథ చెప్పేటపుడే అద్భుతమైన నేరేషన్‌తో నేను ఆశ్చర్యపోయేలా చేశాడు. ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది. ప్రతి ఒక్కరి నుండి సినిమా హిట్టవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అజయ్ భూపతి రూపంలో మరొక మంచి దర్శకుడు తెలుగు ఇండస్ట్రీకి దొరికారు అని ఆయన చెప్పుకొచ్చారు.

సినిమాలో ఎంత మంచి యాక్టర్లు ఉన్నా? టెక్నీషియన్లు ఉన్నా...? డైరెక్టర్ అనే వ్యక్తి ఎంతో కీలకం. అతడు రాసుకున్న స్క్రిప్టు ప్రకారమే అంతా జరుగుతుంది. యాక్టర్లు, టెక్నీషియన్లు స్క్రిప్టు అనే వెహికిల్ మీద ప్రయాణిస్తాం. అది సరిగా ఉన్నపుడే మన డెస్టినేషన్ రీచ్ అవుతాం. అది సరిగా లేక పోతే సినిమా సరిగా ఆడదు. అది డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. అతడు చెప్పింది చెప్పినట్లు సినిమా తీశారు. ఇలాంటి ఒక మంచి డైరెక్టర్‌తో సినిమా చేయడం లక్కీగా భావిస్తున్నాను అంటూ రావు రమేష్ పొగడ్తలతో ముంచెత్తారు.
హీరో కార్తీకేయతో ఫస్ట్ షాట్ చేసినపుడు అతడు మంచి యాక్టర్ అవుతాడనే నమ్మకం కలిగింది. రేపు సినిమా రివ్యూల్లో ఇతడికి మంచి కాంప్లిమెంట్స్ రావడం ఖాయం. కొన్ని సీన్లలో అయితే పూర్తిగా అందులో జీవించాడు. చాలా కష్టపడ్డారు. ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర హీరోయిన్ పాయల్. సినిమా చూసిన తర్వాత ఆమె రోల్ ఎంత ముఖ్యమైనదో అర్థం అవుతుందని రావు రమేష్ తెలిపారు.
ఒకప్పటి హీరో రాంకీ ఇందులో హీరో తండ్రి పాత్రలో చేయడం సినిమాకు మరింత ప్లస్ అవుతుంది. టెక్నీషియన్లు అందరూ అద్భుతంగా చేశారు. ఈ సినిమాకు ప్రధాన బలం స్క్రిప్టు. ఈ సినిమా మీ అందరినీ రెచ్చగొట్టడం ఖాయం అని రావు రమేష్ తెలిపారు.


Click it and Unblock the Notifications











