twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేసుగుర్రం విలన్‌ని నిండా ముంచేశారు.. కేసు నమోదు, ఏం జరిగిందంటే!

    |

    రేసుగుర్రం, సుప్రీం, పటాస్ చిత్రాలతో విలన్ గా రవికిషన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మూడు చిత్రాలు విజయం సాధించడంతో రవికిషన్ కు విలన్ గా అవకాశాలు దక్కుతున్నాయి. చివరగా రవికిషన్ తెలుగులో సాక్ష్యం చిత్రంలో నటించారు. కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నారు. తాజాగా రవికిషన్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల వలలో చిక్కుకుని 1.5 కోట్లు పోగొట్టుకున్నారు. ముంబైలో ఈ ఘటన జరిగింది. ప్లాట్ కొనుగోలు కోసం ఈ మొత్తాన్ని రవి కిషన్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందించారట. వాళ్ళు కాస్త ప్లేటు ఫిరాయించడంతో తాను మోసపోయానని రవికిషన్ తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ప్లాట్ కోసం వెళితే చెవిలో పువ్వు

    ప్లాట్ కోసం వెళితే చెవిలో పువ్వు

    రవికిషన్ ముంబైలో ప్లాట్ కొనుగోలు చేసేందుకు కమల ల్యాండ్ మార్క్ గ్రూప్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు 1.5 కోట్లు చెల్లించారట. దీనితో రవి కిషన్ కు సదరు సంస్థ అలాట్ మెంట్ లెటర్ కూడా అందించింది. డబ్బు వసూలు చేసారు కానీ ఇంతవరకూ ఇవ్వకపోవడంతో ఆరాతీయడానికి వెళ్లగా కంపెనీ అధినేతలు మోసం చేసినట్లు అర్థం అయింది. దీనితో రవికిషన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.

    మొత్తం 8 కోట్లు టోపీ

    మొత్తం 8 కోట్లు టోపీ

    రవికిషన్ తో పాటు మరో వ్యాపారి కూడా కమల ల్యాండ్ మార్క్ సంస్థ ఉచ్చులో పడి మోసపోయాడు. సునీల్ నాయర్ అనే వ్యాపారవేత్తరియల్ ఎస్టేట్ సంస్థకు 6.5 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. సునీల్ నాయర్ మాట్లాడుతూ.. నేను 6.5 కోట్లు, రవికిషన్ 1.5 కోట్లు ఆ సంస్థకు చెల్లించాం. 3,165 చదరపు మీటర్ల పరిధిలో, 12 వ అంతస్థులో రవికిషన్ కు ఇల్లు కేటాయిస్తామని చెప్పారు. ఇంతవరకు ఆ పని జరగకపోవడంతో పోలీసులని ఆశ్రయించినట్లు రవికిషన్ తెలిపారు.

    చీటింగ్ ఆలస్యంగా

    చీటింగ్ ఆలస్యంగా

    ఈ కేసు విషయంలో పోలీసులు మాట్లాడుతూ.. రవి కిషన్, సునీల్ నాయర్ తరహాలో ఇంకెవరైనా మోసపోయారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. ఈ రియల్ ఎస్టేట్ సంస్థకు ఎవరికీ వారు సొంతంగా డబ్బు చెల్లించారు. అందుకే ఒక్కో కేసు నెమ్మదిగా వెలుగులోకి వస్తోంది. హౌస్ ఓనర్స్ అంత ఒక అసోసియేషన్ గా లేకపోవడం వలన ఈ చీటింగ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.

    2016 నుంచే

    2016 నుంచే

    2016 నుంచే కమల ల్యాండ్ మార్క్ గ్రూప్ సంస్థపై పలు కేసులు నమోదవుతూ వస్తున్నాయి. వీరి మోసాలు భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో సునీల్ నాయర్ వ్యక్తం చేస్తున్న అనుమానాల ప్రకారం.. సదరు సంస్థ కస్టమర్స్ నుంచి డబ్బు వసూలు చేసి.. వేరే సంస్థకు చెందిన హోసింగ్ లిమిటెడ్ లో ప్లాట్స్ చూపించారు. రెండు కంపెనీల పేర్లు దాదాపుగా ఒకేరంగా ఉండడంతో కస్టమర్లు నమ్మి మోసపోయారని సునీల్ నాయర్ తెలిపారు.

    English summary
    Actor Ravi Kishan booked flat, duped of Rs 1.5 crore by Mumbai realty firm. Actor Ravi Kishan had submitted a complaint to EOW a few weeks ago against Jitendra Jain, Jinendra Jain and Ketan Shah, directors of Kamala Landmarc Group.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X