సైరాలో ఊరి పెద్దగా మారిన బాలీవుడ్ నటుడు!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నాడు. స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. సైరా చిత్రంలో పేరుగాంచి ప్రముఖ నటులంతా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇప్పటికే అమితాబ్ భాగం షూటింగ్ పూర్తయిపోయింది. నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతి బాబు, తమిళ నటుడు విజయ్ సేతుపతి, నాజర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సైరా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇదిలా ఉండగా మరో బాలీవుడ్ నటుడు సైరా చాటింగ్ లో జాయిన్ అయ్యారు. రేసు గుర్రం, సుప్రీం వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన రవి కిషన్ ఈ సైరా చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. రవి కిషన్ గ్రామ పెద్దగా కనిపిస్తాడట. బ్రిటిష్ వారిపై సైరా సరసింహారెడ్డి చేసే పోరాటాన్ని రవి కిషన్ వ్యతిరేకించే పాత్ర ఇది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











