సుదీప్ మూవీ షూటింగులో... రవిశంకర్‌కి గాయాలు
సినిమా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం... కర్నాటకలోని బాలయ్య నాయుడు స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుండగా ఆయన తాడు పట్టుకుని పాకుతూ కింద పడిపోయారు. వెంటనే యూనిట్ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతనికి ప్రమాదం లేదని స్పష్టం చేసారు.
ఈ విషయాన్ని కిచ్చా సుదీప్(ఈగ విలన్) తన ట్విట్టర్ ద్వారా కన్ ఫర్మ్ చేసారు. రవిశంకర్ చాలా బాగా కోలుకుంటున్నారని, ఆయనకు జరిగింది మేజర్ ఇంజురీ కాదని, ఫాక్చర్ అవ్వడం కానీ, మజిల్ ఇంజురీ అవ్వడం కానీ కాలేదని, అతను కోలుకోవాలని కోరుకునే వారందరికీ కృతజ్ఞతలు అని ట్వీట్ చేసారు.
'బచ్చన్' చిత్రానికి శశాంక్ దర్శకత్వం వహిస్తున్నారు. సుదీప్ హరోగా రూపొందుతున్న ఈచిత్రంలో భావన, తులిప్ జోషి, పురుల్ యాదవ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవి శంకర్, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు హీరో జగపతి బాబు ఈచిత్రంలో అతిథి పాత్ర పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications












