సీక్రెట్ సూపర్‌స్టార్ అమోఘం.. జైరా, అద్వైత్‌పై రవితేజ ప్రశంసల జల్లు

సినీ పరిశ్రమలో సాధారణంగా ఒక హీరో సినిమాలపై మరో హీరో ప్రశంసలు కురిపించడం చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఏదైనా చిత్రం నచ్చితే బయటకు చెప్పడానికి కాస్త ఆలోచిస్తారు.

By Rajababu

సినీ పరిశ్రమలో సాధారణంగా ఒక హీరో సినిమాలపై మరో హీరో ప్రశంసలు కురిపించడం చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఏదైనా చిత్రం నచ్చితే బయటకు చెప్పడానికి కాస్త ఆలోచిస్తారు. కానీ మాస్ మహారాజ్ రవితేజ్ తీరే వేరు. ఏదైనా చెప్పాలనుకొంటే తన మనసులో ఉన్న మాటను వెంటనే చెప్పేస్తారు. తాజాగా అమీర్ నటించి, నిర్మించిన చిత్రం సీక్రెట్ సూపర్‌స్టార్‌పై రవితేజ ప్రశంసల వర్షం కురిపించడం గమనార్హం. సీక్రెట్ సూపర్‌స్టార్‌పై రవితేజ ఏమన్నారంటే..

సీక్రెట్ సూపర్‌స్టార్‌లో జైరా వసీమ్

సీక్రెట్ సూపర్‌స్టార్‌లో జైరా వసీమ్

సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రంలో దంగల్‌లో ప్రధాన పాత్ర పోషించిన జైరా వసీం ఈ చిత్రంలో మరో ఇంపార్టెంట్ రోల్‌ను పోషించారు. గాయని కావాలన్న కోరిక రగిలిపోయే పాత్రలో జైరా కనిపించారు. ఆమె నటనకు బ్రహ్మండమైన రెస్పాన్స్ వస్తున్నది.

జైరా వసీమ్ ఎక్సలెంట్

ఇటీవల సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రాన్ని చూసిన రవితేజ.. జైరా వసీమ్ నటన ఎక్సలెంట్ అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు అద్వైత్ చందన్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. అతని టాలెంట్ ఆమోఘం. అంతగా తేలికగా తీసుకోవడానికి వీల్లేదు అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

19న సీక్రెట్ సూపర్‌స్టార్ రిలీజ్

19న సీక్రెట్ సూపర్‌స్టార్ రిలీజ్

అమీర్ ఖాన్, జైరా వసీమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌' అక్టోబర్‌ 19న విడుదలైంది. అమీర్ ఖాన్ మ్యూజిక్ డైరెక్టర్ పాత్రను పోషించాడు. కాస్త నెగిటివ్ పాత్ర అనిపించినా అద్భుతమైన నటనతో ఆకట్టుకొన్నాడు.

సీక్రెట్ సూపర్‌స్టార్ కథ ఇదే..

సీక్రెట్ సూపర్‌స్టార్ కథ ఇదే..

బరోడా ముస్లిం అమ్మాయి కథగా.. గుజరాత్‌లోని బరోడాలో ఎనిమిదో తరగతి చదువుకునే ముస్లిం అమ్మాయి ఇన్సియా (జైరా వసీం)కు జీవితంలో ఓ గొప్పగా సింగర్ కావాలనే కల ఉంటుంది. తన కల వెనుక మత పరమైన అడ్డంకులు ఉంటాయి. ఆ అమ్మాయి కలను గెలిపించడానికి తల్లి నజ్మా ( మెహర్)విశేష పోరాటం ఉంటుంది. ఓ నాలుగేళ్ల తమ్ముడి (కబీర్) ఆరాటం ఉంటుంది. అమ్మాయి కలను సాకారం చేసేందుకు ఓ పదిహేను ఏళ్ల ప్రేమికుడు (చింతన్) అహర్నిశలు ప్రయత్నిస్తుంటాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. మరో వైపు ఆ అమ్మాయి కలను చిధ్రం చేయడానికి విలన్ రూపంలో తండ్రి (రాజ్ అర్జున్) ప్రయత్నిస్తుంటాడు. మధ్య తరగతిలో ఉండే ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తాయి. ఇలాంటి పాత్రల మధ్య జరిగే భావోద్వేగ సంఘర్షణకు వెండి తెర రూపమే సీక్రెట్ సూపర్‌స్టార్.

సాదాసీదాగా.. భావోద్వేగమైన కథ

సాదాసీదాగా.. భావోద్వేగమైన కథ

సీక్రెట్ సూపర్‌స్టార్‌ చిత్రంలో పాపులారిటీ ఉన్న నటీనటులు కనిపించరు. బాహుబలి చిత్రంలా గ్రాఫిక్స్ ఉండవు. స్పైడర్ సినిమా మాదిరిగా భారీ బడ్జెట్ చిత్రం కాదు. పాపులారిటీ ఉన్న విలన్ కనిపించడు. కేవలం కథ, కథనం, ఎమోషనల్ సన్నివేశాలు, పాత్రధారుల అద్భుతమైన నటన ఈ సినిమాకు స్టార్ స్టామినా. సినిమా చూస్తున్నంత సేపు కొన్ని పాత్రలను ప్రేమిస్తాం. మరో కొన్ని పాత్రలను ద్వేషిస్తాం. పాత్రలతోపాటు కన్నీరు పెట్టుకొంటాం. నవ్వుతాం. సినిమాలో లీనం అవుతాము. కథలో కుటుంబ సభ్యుడిగా భాగమైపోతాం. అంతటి గొప్ప సినిమాగా సీక్రెట్ సూపర్‌స్టార్ రూపొందింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X