రవితేజ ‘రియాక్ట్’ షార్ట్ ఫిల్మ్.... ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది!

హీరో రవితేజ నిర్మించిన ‘రియాక్ట్’ షార్ట్ ఫిల్మ్ చూసిన ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. అమ్మాయిలపై లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్ కాన్సెప్టుతో ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించారు.

By Bojja Kumar

Recommended Video

Raviteja's "React" Short Film Goes Viral రవితేజ షార్ట్ ఫిల్మ్... అదుర్స్

హీరో రవితేజ తాజాగా తన ట్విట్టర్లో షేర్ చేసిన ఓ షార్ట్ ఫిల్మ్ వీడియో ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. ప్రతి అమ్మాయి ఒకరి చెల్లెలు లేదా కూతురే.... అంటూ రవితేజ ఈ షార్ట్ ఫిల్మ్ షేర్ చేశారు. దీన్ని నిర్మించింది కూడా రవితేజే కావడం విశేషం.

కృష్ణ అనిల్ దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్ మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, ఈవ్ టీజింగ్ అంశాలను ఉద్దేశించి రూపొందించారు. ఇలాంటివి మన కళ్లముందు జరిగినపుడు ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వాలి అనే కాన్సెప్టుతో దీన్ని రూపొందించారు.

రవితేజ సందేశం అదుర్స్

రవితేజ సందేశం అదుర్స్

తమవారు బాగుంటే చాలని కోరుకునే ఈ కాలంలో ఎదుటి వారికి కూడా సాయం చేయాలంటూ సందేశం ఇస్తూ ఈ షార్ట్‌ ఫిల్మ్ నిర్మించిన రవితేజ, దర్శకత్వం వహించిన కృష్ణ అనిల్‌పై ప్రశంసలు వర్షం కురుస్తోంది.

షార్ట్ ఫిల్మ్‌లో ఏం చూపించారు?

షార్ట్ ఫిల్మ్‌లో ఏం చూపించారు?

హైదరాబాద్ సిటీ బస్సులో ఈ షార్ట్ ఫిల్మ్ చిత్రీకరించారు. రాత్రి వేళ ఓ అమ్మాయి ఒంటరిగా ప్రయాణిస్తుంది. మార్గ మధ్యంలో ఇద్దరు అమ్మాయిలు తమ తండ్రి, సోదరుడితో కలిసి బస్సెక్కుతారు. తర్వాత ముగ్గురు ఆకతాయిలు బస్సు ఎక్కి ఒంటరిగా ఉన్న అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. అది చూసిన ఇద్దరు అమ్మాయిల తండ్రి, సోదరుడు అలా చేస్తున్న వారిపై రియాక్ట్ అవ్వకుండా మిన్నకుండిపోతారు. తమ పక్కన ఉన్న ఆడపిల్లలకు జరుగడం లేదుకదా, మనకెందుకు అనే ధోరణిలో మిన్నకుండిపోతారు.

హీరో శ్రీవిష్ణు ఎంట్రీ

హీరో శ్రీవిష్ణు ఎంట్రీ

ఇంతలో మరో స్టాప్‌లో ఓ యువకుడు(శ్రీవిష్ణు) ఇదే బస్సు ఎక్కుతాడు. అప్పుడు ఆ ముగ్గురు అబ్బాయిలు అమ్మాయిని ఏడిపించడం గమనిస్తాడు. ఆ తండ్రి, అన్నయ్య రియాక్ట్ అయ్యేలా వారికి తగిన గుణపాఠం చెప్తాడు. ఈ షార్ట్ ఫిల్మ్ కేవలం ఆ ఇద్దరి కళ్లు మాత్రమే కాదు.... ఈ సమాజంలోని ప్రతి ఒక్కరినీ అలాంటి సంఘటనలు జరిగినపుడు ‘రియాక్ట్' అయ్యేలా ప్రేరేపించేలా ఉంది.

ట్వీట్ చేసిన రవితేజ

ప్రతి అమ్మాయి ఒకరి చెల్లెలు లేదా కూతురు.... అంటూ రవితేజ ఈ షార్ట్ ఫిల్మ్ షేర్ చేశారు. ఈ షార్ట్ ఫిల్మ్ మీద మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X