For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  హాట్‌హాట్‌గా రియాసేన్.. సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తున్న బికినీ బేబీ

  By Rajababu
  |
  సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తున్న బికినీ బేబీ !

  బాలీవుడ్ సినిమాల్లో అప్పుడప్పడు కనిపిస్తున్న బాలీవుడ్ రియా సేన్ ట్విట్టర్‌లో మాత్రం సంచలనం రేపుతుంటుంది. హిందీ, మలయాళ, ఒరియా, బెంగాలీ చిత్రాల్లో నటించే రియా సోషల్‌ మీడియాలో మాత్రం అగ్గి రాజేస్తుంటుంది. ఆమె చివరిసారి రబ్బా మై క్యా కరూ అనే హిందీ చిత్రంలో నటించింది. ప్రస్తుతం రాగిణి ఎమ్ఎమ్ఎస్ రిటర్స్న్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న రియా సేన్ తాజాగా ట్విట్టర్‌లో పెట్టిన ఫొటో దుమారం లేపుతున్నది.

   బాలీవుడ్‌కు దూరం

  బాలీవుడ్‌కు దూరం

  బాయ్‌ఫ్రెండ్ శివమ్ తివారీని పెళ్లి చేసుకొన్న తర్వాత దాదాపు బాలీవుడ్ నుంచి కనుమరుగైపోయింది. అప్పట్లో హానీమూన్ ఫొటోలను సోషల్ మీడియాలో గుప్పించి సంచలనం రేపింది. తాజాగా బ్లాక్ స్విమ్‌సూట్‌లో ఉన్న తన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది.

  మున్ మున్ సేన్ కూతురిగా

  మున్ మున్ సేన్ కూతురిగా

  రియా సేన్ ఎవరో కాదు.. ప్రఖ్యాత నటి సుచిత్రా సేన్ మనువరాలు. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరివెన్నెల చిత్రంలో నటించిన మున్ మున్ సేన్ రియాకు తల్లి. మరో బాలీవుడ్ నటి రైమా సేన్ ఈవిడకు సోదరి.

   బాలనటిగా పరిచయం

  బాలనటిగా పరిచయం

  తల్లి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని 1991లో విషకన్య అనే చిత్రంలో బాలతారగా సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో నటించి మంచిపేరు తెచ్చుకొన్నది.

   స్టైల్ చిత్రంలో హీరోయిన్‌గా

  స్టైల్ చిత్రంలో హీరోయిన్‌గా

  2001లో స్టైల్ అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. లో బడ్జెట్ చిత్రంగా ఎన్ చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకొన్నది.

  ఝంకర్ బీట్స్‌తో టాప్

  ఝంకర్ బీట్స్‌తో టాప్

  రియా సేన్‌కు గుర్తింపు తెచ్చిన చిత్రాలు షాదీ నంబర్1, ఝంకర్ బీట్స్, మలయాళంలో ఆనంతభద్రం చిత్రాలు. దాదాపు 50 చిత్రాలకు పైగా నటించింది.

   వీడియో ఆల్బమ్స్‌లో కూడా

  వీడియో ఆల్బమ్స్‌లో కూడా

  పాల్గుణి పాథక్ రూపొందించిన మ్యూజిక్ వీడియో యాద్ పియా కి ఆనే లగీ అనే వీడియో ఆల్బమ్ నటించడం ద్వారా మంచి పేరు తెచ్చుకొన్నది.

  భారతీరాజా దర్శకత్వంలో

  భారతీరాజా దర్శకత్వంలో

  ప్రముఖ దర్శకుడు భారతీ రాజా రూపొందించిన తాజ్ మహల్ చిత్రంలో మంచి పాత్రను ధరించింది. తమిళంలో కూడా మంచి పాత్రలే వచ్చాయి. కానీ ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే అంగీకరించింది.

   టాలీవుడ్‌లో మంచు మనోజ్‌తో

  టాలీవుడ్‌లో మంచు మనోజ్‌తో

  తెలుగులో మంచు మనోజ్ నటించిన నేను మీకు తెలుసా అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాల రాకపోవడం, బెంగాలీ భాషలో భారీ ఆఫర్లు దక్కడంతో బిజీగా మారింది.

   యాడ్ ఫిల్మ్స్‌లో హాట్ మోడల్‌గా

  యాడ్ ఫిల్మ్స్‌లో హాట్ మోడల్‌గా

  కేవలం సినిమాల్లో నటించడమే కాకుండా, హాట్ మోడల్‌గా కూడా రాణించింది. లిమ్కా యాడ్‌లో దీపికా పదుకొనే తర్వాత ఆమె స్థానాన్ని రియా సేన్ కైవసం చేసుకొన్నది. కోల్గెట్, దాబర్ వాటిక, రిలయన్స్ ఇండస్ట్రీస్, క్యాడ్బరీ డైరీ మిల్క్, నిర్మా లాంటి ఉత్పత్తులకు మోడల్‌గా నటించింది.

   ఫొటోషూట్‌లో హాట్ హాట్‌గా

  ఫొటోషూట్‌లో హాట్ హాట్‌గా

  గాయకులు ఆశాభోంస్లే, లతా మంగేష్కర్, సోను నిగమ్, షాన్ రూపొందించిన వీడియో ఆల్బమ్స్‌లో కూడా నటించి మెప్పించింది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ ఫొటోషూట్‌లో కూడా హాట్ హాట్‌గా నటించింది.

   గోవాలో హాలీడే ఎంజాయ్

  గోవాలో హాలీడే ఎంజాయ్

  గోవాలో స్నేహితులతో హాలీడేను ఎంజాయ్ చేస్తున్న దృష్యమిది. బికినీ బేబీగా పేరున్న రియా సేన్ తెల్లటి బికినీలో కనిపించింది.

  English summary
  The lovely Riya Sen's latest Twitter picture sporting a black bikini has got us thinking as to which one looks really good on her. Her previous pictures were all about sporting a white bikini, chilling by the beach in Goa along with her friends and it's tough to come to a conclusion as to which one is truly hotter.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more