For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చంద్రబాబుకు ఉప్పుకారం పెట్టా.. ఉసురు తాకింది, వెధవల్లారా నేను గోల్డెన్ లెగ్.. సినీ నటి రోజా ఫైర్

|

సినీ రంగంలోనే కాదు.. రాజకీయాల్లోనూ సినీ నటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత రోజా సత్తా చాటారు. వరుసగా రెండోసారి విజయం సాధించి తనపై ఉన్న అపవాదును తొలగించుకొన్నారు. నగరి నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, టీడీపీ నేతలు చేసిన పాపాల వల్లే వారికి ఈ పరాజయం ఎదురైందని అన్నారు. జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ.. బై బై బాబు అని సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ..

దోచుకోవడానికే ఆయన అనుభవం పనికొచ్చింది

వైఎస్ఆర్ కాంగ్రెస్ అఖండ విజయం ఎదురుచూసిందే. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అనుభవం ఉన్న నేత కావాలని అధికారాన్ని చంద్రబాబుకు అప్పగించారు. కానీ గత ఐదేళ్లో ఆయన అనుభవం కుటుంబానికి దోచిపెట్టడం, అవినితి కోసమే ఉపయోగించారు. రాష్ట్ర అభివృద్దికి గానీ, ప్రజల సంక్షేమానికి ఉపయోగపడలేదనే ప్రజలు గ్రహించడం వల్లే ఈ విజయం లభించింది అని రోజా అన్నారు.

కష్టాలు దూరమవుతాయని ప్రజలు నమ్మారు

ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా వాటిని తట్టుకొని వైఎస్ జగన్ ప్రజల పక్షాన నిలబడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడిన విధానం ప్రజలను ఆకట్టుకొన్నది. ప్రజల పక్షాన నిలబడే ఈ రాష్ట్రానికి అవసరమని భావించారు. రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యమని నమ్మారు. కష్టాలు దూరమవుతాయని భావించారు కాబట్టే ఈ విజయం అని రోజా అన్నారు.

ఆయనకు ఉప్పుకారం పెట్టారని

చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలు మోసపోయారు. డ్వాక్రా మహిళలు అప్పులపాలయ్యారు. వడ్డీలేని రుణాలు ఇవ్వకపోవడంతో కష్టాలు అనుభవించారు. చివరకు ఎన్నికల ముందు పసుపు కుంకుమ పథకంతో మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నించారు. అది గ్రహించిన ప్రజలు ఆయనకు ఉప్పు, కారం పెట్టి గుణపాఠం నేర్పారు.

ఆ వెధవలకు ఇదే నా వార్నింగ్

నగరి ప్రజలు పెట్టుకొన్న ఆశలను వమ్ము చేయను. జగన్ పాలనలో నగరిని అభివృద్ది చేస్తాను. మంత్రి పదవిపై ఆశలేదు. జగనన్న ఏదీ చేస్తే, ఏది ఇస్తే దానిని తీసుకొని సంతోషపడుతాను. అసెంబ్లీలో, బయట నాపై కూసిన వెధవలకు చెబుతున్నాను. నేను గెలిస్తే జగన్ అధికారంలోకి రాడు.. ఐరన్ లెగ్ అన్న వాళ్లకు వార్నింగ్. నేను గోల్డెన్ లెగ్ అని నిరూపించాను అని రోజా అన్నారు.

నన్ను సస్సెండ్ చేసి అన్యాయం

నా ఉసురు తగిలే చంద్రబాబు ఓటమిపాలయ్యాడు. కాల్ రాకెట్ కుంభకోణంలో మహిళలకు అన్యాయం చేశాడు. నిందితులకు అండగా నిలిచాడు. నేను వ్యతిరేకిస్తే నన్ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశాడు. ఆ పాపం తగిలే ఇలాంటి అనుభవం ఆయనకు ఎదురైంది. వాళ్లు చేసిన పాపాలకు తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కాబోతున్నది అని రోజా అన్నారు.

Read more about: ysrcp వైసీపీ
English summary
Actor Roja won from Nagari assembly with good majority. She said People trusted YS Jagan than Chandrababu Naidu. and She fires on Nara Chandra Babu Naidu and others who called her Iron Leg.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more