twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శిల్పాశెట్టికి బాంబే హైకోర్టు మరో షాక్.. హీరో సచిన్ జోషికి కిలో బంగారం.. రాజ్ కుంద్రా ఖర్మ అంటూ వ్యాఖ్యలు

    |

    శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాతో జరిగిన సుదీర్ఘమైన న్యాయపోరాటంలో సినీ నటుడు సచిన్ జోషికి విజయం లభించింది. గోల్డ్ స్కీమ్‌లో తనను మోసం చేశారంటూ రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టి, వారి కంపెనీ డైరెక్టర్లపై సచిన్ జోషి బాంబే హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో శుక్రవారం సచిన్ జోషికి అనుకూలంగా సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

    గోల్డ్ స్కీమ్‌లో చీటింగ్

    గోల్డ్ స్కీమ్‌లో చీటింగ్

    రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి దంపతులు గతంలో సత్‌యుగ్ గోల్డ్ స్కీమ్‌ను నిర్వహించారు. ఈ స్కీమ్‌లో సచిన్ జోషి ఖాతాదారుడిగా చేరారు. తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెప్పి నిధులు సేకరించారు. అయితే బంగారం ఇవ్వడంలో విఫలం కావడంతో సత్యయుగ్ గోల్డ్ ఇన్వెస్టర తరఫున సచిన్ జోషి కేసును 2014లో నమోదు చేశారు.

    సచిన్ జోషికి

    సచిన్ జోషికి

    సత్యయుగ్ గోల్డ్ కేసులో బాంబే కోర్టు తీర్పు వెల్లడిస్తూ.. సచిన్ జోషికి, ఇతర ఇన్వెస్టర్లకు ఒక కేజీ బంగారం ఇవ్వాలి. అంతేకాకుండా సచిన్ జోషికి 3 లక్షల రూపాయలను కోర్టు ఖర్చుల కోసం చెల్లించాలి అని తెలిపింది. ఈ తీర్పుపై సచిన్ జోషి సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారితో కలువడం నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అని సచిన్ జోషి వ్యాఖ్యానించారు.

    బాంబే హైకోర్టు సంచలన తీర్పు

    బాంబే హైకోర్టు సంచలన తీర్పు

    రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి దంపతులతో నేను సుదీర్ఘంగా న్యాయపోరాటం చేశాను. సత్‌యుగ్ గోల్డ్ స్కీమ్ కోసం మార్చి 2014‌లో రూ. 18,57,870 చెల్లించాను. అయితే ఆ మొత్తానికి గోల్డ్ ఇవ్వడానికి 25 లక్షలు చెల్లించాలని శిల్పాశెట్టి దంపతులు డిమాండ్ చేశారు. భారీ మొత్తంలో డబ్బు చెల్లించిన తర్వాత వారు ముఖం చాటేసే ప్రయత్నం చేశారు. మాలాంటి వారి పరిస్థితి ఇలా ఉంటే.. సాధారణ పౌరుల సంగతి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి అని సచిన్ జోషి మీడియాతో అన్నారు.

    నన్ను చీటింగ్ చేశారంటూ

    నన్ను చీటింగ్ చేశారంటూ

    నేను డబ్బు చెల్లించిన తర్వాత ఆరేళ్లు వేచి చూశాను. దాంతో వాళ్లు నన్ను చీటింగ్ చేశారని భావించి ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాను. నా ఫిర్యాదు ఆధారంగా వారిపై, సత్‌యుగ్ గోల్డ్ సంస్థపై ఐపీసీ 420, 409, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాంతో వారు నన్ను టార్గెట్ చేస్తూ నాపై రకరకాల ఆరోపణలు చేశారు. అయితే నేను భయపడకుండా అనేక మంది ఇన్వెస్టర్ల తరఫున న్యాయం పోరాటం కొనసాగించాను అని సచిన్ జోషి తెలిపారు.

    Recommended Video

    Shilpa Shetty Hosts A Grand Birthday Bash For Hubby Raj Kundra | Filmibeat Telugu
    రాజ్ కుంద్రా ఖర్మను అనుభవిస్తున్నాడంటూ

    రాజ్ కుంద్రా ఖర్మను అనుభవిస్తున్నాడంటూ

    కుంద్రాపై కేసు నమోదు చేసిన తర్వాత ప్రతీ క్లయింట్‌కు బంగారం అందించేందుకు చర్యలు చేపట్టారు. అయితే నాకు ఇవ్వకుండా తప్పించుకొనేందుకు చూశారు. అయితే కోర్టు తీర్పు వారికి చెంప పెట్టు మారింది. నాకు 1 కేజీ బంగారంతోపాటు 3 లక్షలు అదనంగా వచ్చాయి. చేసిన తప్పుకు కుంద్రా ఫ్యామిలీ ఖర్మను అనుభవిస్తున్నది అంటూ సచిన్ జోషి పేర్కొన్నారు.

    English summary
    Actor Sachiin Joshi won Court Battle against Raj Kundra, Shilpa Shetty in Satyug Gold case. Bombay high Court directed that Satyug Gold hands over the possession of 1 kg gold as well as pay Joshi a sum of Rs. 3,00,000 as cost towards legal proceedings.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X