For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sai Dharam Tej review on Sita Ramam గుండె ముక్కలైంది.. ఐ హేట్ యూ అంటూ రివ్యూతో మెగా మేనల్లుడు అదుర్స్

  |

  హృదయాన్ని కదిలించే ప్రేమకథ తెరకక్కిన సీతారామం సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. సాధారణ ప్రేక్షకులే కాకుండా క్రిటిక్స్, సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను, రివ్యూలను సోషల్ మీడియాలో పంచుకొంటున్నారు. నా హృదయపు పొరల్లో అందమైన చిత్రం గురించి నేను చాలా సార్లు ఐ హేట్ యూ అని రాసి.. మళ్లీ చెరిపేశాను అంటూ సాయిధరమ్ తేజ్ కామెంట్ చేశాడు. తాజాగా సీతారామం సినిమాపై ప్రత్యేకంగా రాసిన సాయిధరమ్ తేజ్ రివ్యూ ఎలా ఉందో చూద్దామా?

  స్వప్నక్క ఐ హేట్ యూ

  స్వప్నక్క ఐ హేట్ యూ


  స్వప్నక్క ఏ హేట్ యూ. నీవు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెండేళ్లు నీవు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. నీవు రామ్, సీత ప్రేమకథను ఎంతగా నమ్మావో నాకు తెలుసు. ముత్యం లాంటి సినిమాను నిర్మించడమే కాకుండా సమాజంలో ఇంకా ప్రేమ ఉందనే నమ్మకం కలిగించావు. నిజమైన ప్రేమ కోసం బ్రహ్మచారిగా నేను తపించేలా చేశావు అని సాయిధరమ్ తేజ్ తన పోస్టులో పేర్కొన్నారు.

  ప్రతీ క్యారెక్టర్‌ను అద్బుతంగా మలిచి

  ప్రతీ క్యారెక్టర్‌ను అద్బుతంగా మలిచి


  హను రాఘవపూడి.. ఐ హేట్ యూ. నీవు ప్రతీ విభాగాన్ని అద్భుతంగా చూపించావు. ప్రతీ ఫ్రేమ్‌ను దృశ్యకావ్యంలా మలిచి ఓ మ్యాజిక్‌ను ఆవిష్కరించావు. ప్రతీ క్యారెక్టర్‌ను అద్బుతంగా మలిచావు. ప్రతీ సీన్‌లో నటీనటులు వందకు వంద శాతం తమ ప్రతిభను చూపించారు. వెండితెరపై అద్బుతమైన పెయింటింగ్‌ను, సంగీతాన్ని ఆవిష్కరించావు. సెకండాఫ్ సిండ్రోమ్‌ను అధిగమిస్తావని చెప్పి.. దాని తెరమీద నిరూపించుకొన్నావు. మూడు పాటలను ఎస్పీ చరణ్‌తో పాడించి.. సంగీత దిగ్గజమైన ఆయన తండ్రి బాలును గుర్తు చేశావు అని సాయిధరమ్ తేజ్ పేర్కొన్నారు.

  దుల్కర్ నేను నీకు అభిమానిని

  దుల్కర్ నేను నీకు అభిమానిని


  దుల్కర్ గతంలో నీ సినిమాలు చూసి నేను ఫెర్ఫార్మెన్స్‌కు అభిమానిని అయ్యాను. కానీ సీతారామంలో నీ ఫెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నీవు గొప్ప నటుడివి అనే ఫీలింగ్‌తో ఐ హేట్ యూ అనాలనిపించింది. ప్రతీ సీన్‌లో నీ ఫెర్ఫార్మెన్స్‌కు పడిపోయాను. రామ్ పాత్రలో నీవు ఒదిగిపోయావు. రామ్ పాత్రను నీవు తప్ప మరొకరు చేయలేదనే ఫీలింగ్‌ను కల్పించావు అని సాయిధరమ్ తేజ్ చెప్పారు.

   రష్మిక ఐ హేట్ యూ

  రష్మిక ఐ హేట్ యూ


  రష్మిక.. నీవు నటిగా మరిచిపోలేనటు వంటి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చావు. కానీ ఆఫ్రీన్ పాత్ర మాత్రం అన్నింటికి మించి ఉంది. సినిమా ఆరంభంలో నీలో కనిపించిన కాన్ఫిడెన్స్, నీ బాడీ లాంగ్వేజ్ బాగుంది. కానీ సినిమా క్లైమాక్స్‌లో నీ అమాయకత్వం మెరుపులా ఉంది. సీతకు రామ్ పంపిన సందేశాన్ని చేర్చే దూతగా నీ నటన చూసి ఐ హేట్ యూ అని అనాలని ఉంది అని సాయిధరమ్ తేజ్ తన పోస్టులో పేర్కొన్నారు.

  Recommended Video

  Bumper Offer జస్ట్ నిద్రపొతే బోలెడంత జీతం... పోటీపడి దరఖాస్తులు *Trending | Telugu OneIndia
   సీతారామంలో నీ రోల్ నా ఫేవరేట్

  సీతారామంలో నీ రోల్ నా ఫేవరేట్


  సుమంత్ అన్న.. ఇప్పటి వరకు నీవు ఎన్నో అద్భుతమైన పాత్రల్లో కనిపించావు. కానీ నిన్నటి వరకు నాకు మళ్లీ రావా సినిమా ఫేవరేట్. కానీ ఈ రోజు సీతారామంలో నీ రోల్ నాకు ఫేవరేట్ అని సాయిధరమ్ తేజ్ పొగడ్తలతో ముంచెత్తాడు.

  మృణాల్.. గుండె ముక్కలైంది


  సీతా.. నీ పేరుపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అధికారుల నిబంధనలకు లోబడి ఉండు. మరోారి నీవు పారిపోవొద్దు. ఎన్నో హృదయాలు ముక్కలవుతున్నాయి. వాళ్ల మీద కాస్త జాలి చూపండి. నేను మరిచిపోకముందే ఐ హేట్ యూ అని సాయిధరమ్ తేజ్ ప్రేమగా పోస్టులో రాశారు.

  English summary
  Actor Sai Dharam Tej review on Sita Ramam movie which is released on August 5th. He said, I hate you all the actors and technicions for brilliance showed in film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X