నిన్న వివాహం, నేడు విషాదం: హీరో ఆది తాత కన్నుమూత
హైదరాబాద్: నటుడు సాయికుమార్ కుటుంబం అంతా నిన్న ఆది వివాహ వేడుకతో సంబరాల్లో మునిగి తేలిన సంగతి తెలిసిందే. వివాహ వేడుక జరిగిన మరుసటి రోజే ఆ కుటుంబం మొత్తం విషాదంలో మునిగి పోయింది. సాయి కుమార్ తండ్రి, ఆది తాత అయిన పి.జె.శర్మ ఆదివారం ఉన్నయం కన్నుమూసారు. గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది.
పెళ్లి వేడుకలు పూర్తిగా ముగియకుండానే ఈ ఘటన చోటు చోటు చేసుకోవడంతో అందరినీ కలిచి వేసింది. పీ.జే శర్మ మృతిపట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సానుభూతి తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎర్రగడ్డ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని తెలిసింది.

అనారోగ్యం కారణంగా ఆయన ఆది వివాహానికి కూడా హాజరు కాలేక పోయారు. విజయనగరం జిల్లా కల్లేపల్లికి చెందిన పిజె శర్మ నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తెలుగు, తమిళంలో 500లకు పైగా చిత్రాలకు పని చేసారు. ఆయననటించిన చివరి చిత్రం నాగ. కెరీర్లో ఆయన నంది అవార్డుతో పాటు పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు.



Click it and Unblock the Notifications











