శ్యాం కే నాయుడు కేసులో కొత్త ట్విస్టు.. మళ్లీ మోసం అంటూ కోర్టుకెక్కిన నటి సాయిసుధ

సినిమాటోగ్రాఫర్ శ్యాం కే నాయుడు, వర్థమాన నటి శ్రీ సాయి సుధ రిలేషన్‌షిప్ కేసు మరో మలుపు తిరిగింది. తనను మోసగించాడనే ఆరోపణలపై శ్యాం కే నాయుడుపై మే 27వ తేదీన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో సాయి సుధ కేసు నమోదు చేయడం సినీవర్గాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి శ్యాం ఫోర్జరీకి పాల్పడ్డారనే విషయంపై ఫిర్యాదు చేయడం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ కేసులో ఏం జరిగిందంటే..

Recommended Video

Shyam K Naidu మళ్లీ మోసం చేశాడంటూ మరోసారి ఫిర్యాదు చేసిన సాయిసుధ! || Oneindia Telugu
సాయిసుధతో రిలేషన్‌షిప్ అలా

సాయిసుధతో రిలేషన్‌షిప్ అలా

పోకిరి, టెంపర్ చిత్రాలకు సినిమాటోగ్రఫి అందించిన శ్యాం కే నాయుడు వైవాహిక జీవితంలో కలతలు చోటుచేసుకొన్నాయి. ఆ క్రమంలో అర్జున్ రెడ్డి లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకొంటున్న సాయిసుధకు శ్యాం చేరువయ్యారు. ఆ తర్వాత పెళ్లి చేసుకొందామనే అవగాహనతో వారిద్దరూ సహజీవనం చేశారు. అయితే పెళ్లికి సుముఖంగా లేకపోవడంతో సాయిసుధ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మోసగించాడనే ఫిర్యాదుతో

మోసగించాడనే ఫిర్యాదుతో

సాయిసుధ ఫిర్యాదుతో శ్యాం కే నాయుడుని ఎస్ఆర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు. ఇప్పుడు బెయిల్‌పై విడుదల కావడం వివాదంగా మారింది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తప్పుడు బెయిల్ పత్రాలను సృష్టించారు. వాటి ఆధారంగానే శ్యాం విడుదల చేశారనే ఆరోపణలతో మరోసారి ఫిర్యాదు చేశారు.

సంతకం ఫోర్జరీ చేసి బెయిల్

సంతకం ఫోర్జరీ చేసి బెయిల్

తాజాగా మీడియాలో వచ్చిన కథనాలను బట్టి.. సాయిసుధ సంతకాన్ని ఫోర్జరీ చేసి బెయిల్ పత్రాలను సమర్పించారు. వారి మధ్య అవగాహన కుదిరినట్టు కోర్టుకు పత్రాలను దాఖలు చేశారు. అయితే వారి మధ్య అవగాహన కానీ, రాజీ గానీ జరుగలేదనే విషయం బయటకు వచ్చింది.

సాయిసుధ నాంపల్లి కోర్టులో ఫిర్యాదు

సాయిసుధ నాంపల్లి కోర్టులో ఫిర్యాదు

ఇదిలా ఉండగా, తప్పుడు బెయిల్ పత్రాలు సమర్పించి శ్యాం కే నాయుడు బెయిల్ పొందారు అని సాయి సుధ తాజాగా కోర్టుకు ఫిర్యాదు చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. సాయి సుధ ఫిర్యాదు మేరకు నాంపల్లి కోర్టు శ్యాం కే నాయుడు బెయిల్‌ను రద్దు చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ ఫిర్యాదు, బెయిల్ రద్దు వ్యవహారాలను ఇరు వర్గాలు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇరు పార్టీలను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X