ఐదేళ్లు వాడుకొని బ్లాక్‌మెయిల్, బెదిరింపులు: శ్యాం, చోటా కే నాయుడిపై సాయిసుధ ఫైర్!
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యాం కే నాయుడుపై వర్ధమాన తార సాయి సుధ కేసు పెట్టడం సినీ వర్గాల్లో సంచలనం రేపింది. తనను పెళ్లి చేసుకొంటానని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారు. గత ఐదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉండి ప్రస్తుతం ముఖం చాటేస్తుండటంతో నేను కేసు పెట్టాను అని సాయిసుధ చెప్పారు. సాయి సుధ ఫిర్యాదుతో శ్యాం కే నాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..

ఐదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో
సినిమాటోగ్రాఫర్ శ్యాం కే నాయుడుపై కేసు పెట్టాను. పెళ్లి చేసుకొంటానని మోసగించాడని ఫిర్యాదులో తెలిపాను. ఐదేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. ఇప్పుడు భార్యతో ఉంటున్నందున నన్ను దూరం పెడుతున్నాడు. కలిసిన ప్రతిసారి నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. అందుకే అతడి మీద చీటింగ్ కేసు పెట్టాను. వారు ఏం చేస్తారో.. ఎలాంటి నిర్ణయం తీసుకొంటారనే విషయంపై ఎదురుచూస్తున్నాను అని యాక్టర్ సాయి సుధ మీడియాకు తెలిపారు.

శ్యాం నాయుడికి భార్యతో గొడవలు
శ్యాం కే నాయుడుతో 2012 నుంచి పరిచయం ఉంది. 2015 నుంచి రిలేషన్ షిప్‌లో ఉన్నాను. ఇద్దరిది ఒకటే ఫీల్డ్ కావడంతో మా మధ్య రిలేషన్ పెరిగింది. అప్పట్లో ఆయన భార్యతో ఏవో గొడవలు ఉన్నాయి. దాంతో నాకు దగ్గరయ్యారు. అప్పటి నుంచి మా మధ్య జరిగిన ప్రతీ విషయానికి రుజువులు, సాక్ష్యాలు, ఆడియో, వీడియో ఫైల్స్ ఉన్నాయి అని సాయి సుధ పేర్కొన్నారు.

భార్యతో విభేదాలతో నాకు దగ్గరై
మా రిలేషన్‌కు ముందు మేమిద్దరం రెండు సినిమాల్లో కలిసి పనిచేశాం. తనతో ఎక్కువగా ఫేస్‌బుక్‌లో చాట్ చేసేవాడు. తన జీవితంలో భార్యతో జరిగిన విషయాలు పంచుకొనేవాడు. ఓసారి కలుద్దామని అంటే వెళ్లి కలిశాను. ఆ తర్వాత మా మధ్య రిలేషన్ ఏర్పడింది. తన భార్యతో ఇప్పుడు సమస్యలు సర్దుకొన్నాయి. దాంతో నన్ను వదిలేశాడు అని సాయిసుధ వెల్లడించారు.

పెళ్లి చేస్తామని చోటా కే నాయుడు హామీ
శ్యాం కే నాయుడు సోదరుడు చోటా కే నాయుడుకి కూడా మా విషయం తెలుసు. ఆయన మాకు సపోర్టుగా ఉన్నారు. ఇంట్లో సమస్యలు తగ్గుముఖం పట్టిన తర్వాత అధికారికంగా పెళ్లి చేద్దామని అన్నారు. ఇప్పుడు శ్యాం కే నాయుడు ప్రవర్తిస్తున్న తీరు గురించి చెబితే మాకు తెలియదని తప్పించుకొంటున్నారు అని సాయి సుధ వెల్లడించారు.
Recommended Video

సందీప్ కిషన్ అమ్మకు కూడా తెలుసు
శ్యాం కే నాయుడుతో అఫైర్ విషయం సందీప్ కిషన్ తల్లికి కూడా తెలుసు. పలు మార్లు కేసు పెట్టడానికి వస్తుంటే వాళ్లే ఆపారు. ఇప్పుడు ఆ కుటుంబం అంతా నాతో చీటింగ్‌కు పాల్పడుతున్నారు. ఇప్పుడు కేసు పెట్టుకో.. ఏది అయితే అది అవుతుంది. తర్వాత చూసుకొందామంటున్నారు. దాంతో నేను పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి కలిగింది. నాతో మాట్లాడిన విషయాలు, మా మధ్య జరిగిన సంఘటలకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్, వీడియో రికార్డింగ్ తన వద్దే ఉన్నాయి. అవి డిలీట్ కాలేదు అని సాయి సుధ చెప్పారు.


Click it and Unblock the Notifications











