జూ ఎన్టీఆర్ తల్లి కళ్లెంట నీళ్లు పెట్టుకున్నారు, మోహన్ బాబు కూడా భయపడ్డారు: సమీర్

Recommended Video

Actor Sameer About NTR Dialogue Delivery Talent || Filmibeat Telugu

ప్రస్తుతం ఉన్న యంగ్ జనరేషన్ హీరోల్లో అద్భుతంగా డైలాగులు చెప్పగలిగే సత్తా ఉన్న హీరోలు ఎవరు? ఎలాంటి డైలాగులైనా, ఎంత పెద్దగా ఉన్నా సింగిల్ టేక్‌లో ఫినిష్ చేసే టాలెంట్ ఎవరికి ఉంది? అంటే ప్రతి ఒక్కరూ సందేహం లేకుండా వెంటనే చెప్పే పేరు... జూ ఎన్టీఆర్.

జూ ఎన్టీఆర్‌కు సన్నిహితంగా మెలిగే నటుల్లో ఒకరైన సమీర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జూ ఎన్టీఆర్ ఎంత పెద్ద డైలాగులు అయినా ఒక్కసారి చదివేసి చెప్పేస్తారు. ఈ విషయంలో ఆయన్ను బీట్ చేసే వారు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎవరూ లేరన్నారు.

ఆ రోజు ఎన్టీఆర్ టాలెంట్ చూసి ఆంతా ఆశ్చర్యపోయారు

ఆ రోజు ఎన్టీఆర్ టాలెంట్ చూసి ఆంతా ఆశ్చర్యపోయారు

రాఖీ సినిమా సమయంలో రైల్వేస్ గురించి ఓ సన్నివేశం ఉంటుంది. షాయాజీ షిండే ఆఫ్‌ట్రాల్ రైల్వేస్ అని చెప్పిన దానికి ఎన్టీఆర్ కౌంటర్ చెప్పే సీన్ అది. అప్పటికీ ఇంకా డిజిటల్ రాలేదు. ఫిల్మ్ రీల్ మీద చిత్రీకరిస్తున్నారు. బాంబే నుంచి వెయ్యిఫీట్ల క్యాన్ తెప్పించారు. రెండు క్యాన్స్ మాత్రమే ఉన్నాయి. రెండు టేకుల్లో అయిపోవాలి. కారావాన్‌లో కూర్చుని రిహార్సల్ చేసి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఒకే టేక్‌లో ఫినిష్ చేశాడు. అందరూ క్లాప్స్ కొట్టారు. యంగ్ టైగర్ అలా డైలాగ్ చెప్పడం చూసి కోటా శ్రీనివాసరావుగారు కూడా భావోద్వేగానికి గురై కౌగిలించుకుని అభినందించారు.... అని సమీర్ గుర్తు చేసుకున్నారు.

ఆరోజు వన్ మోర్ చెప్పడానికి అంతా భయపడ్డారు

ఆరోజు వన్ మోర్ చెప్పడానికి అంతా భయపడ్డారు

అయితే చిన్న టెక్నికల్ ఫాల్ట్ రావడంతో వన్ మోర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టేక్ ఫినిష్ అయింది కదా అని అప్పటికే ఎన్టీఆర్ వెళ్లి కారావాన్లో కూర్చుకున్నాడు. ఆయనకు ఎవరు వెళ్లి చెబుతారు? వన్ మోర్ చేయమంటే ఎలా రియాక్ట్ అవుతారో అనే భయం అందరిలో ఉంది. చివరకు కృష్ణ వంశీగారే వెళ్లి చెప్పడంతో ఏమీ ఫీలవ్వకుండా పరిస్థితి అర్థం చేసుకుని మరో టేక్‌లో ఫినిష్ చేశారు. తారక్‌ది బ్రిలియంట్ మెమొరీ.. అని సమీర్ చెప్పుకొచ్చారు.

మోహన్ బాబు కూడా భయపడ్డారు

మోహన్ బాబు కూడా భయపడ్డారు

తారక్ వెర్సటైల్ యాక్టర్. ఏదైనా చేయగలడు. మనం ఏ కథ రాసుకున్నా దానికి సూటయ్యేలా మారిపోతాడు. యమదొంగ సమయంలో అతడితో కలిసి డైలాగులు చెప్పడానికి మోహన్ బాబు గారు కూడా భయపడ్డ మాట నిజమే. ఈ విషయం ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు... అని సమీర్ గుర్తు చేసుకున్నారు.

వాల్ల అమ్మగారు కన్నీళ్లు పెట్టుకున్నారు

వాల్ల అమ్మగారు కన్నీళ్లు పెట్టుకున్నారు

‘యమ దొంగ' థియేటర్లో చూస్తూ... ఏమంటివీ ఏమంటివీ అనే పొడవైన డైలాగ్ తారక్ చెప్పిన విధానం చూసి వాళ్ల అమ్మగారైతే థియేటర్లో కళ్లెంట నీళ్లు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ వద్ద మనం చూడంది ఇంకా చాలా ఉంది. మరో వంద రకాల షేడ్స్ ఉన్న పాత్రలు చేయగలిగే స్టాక్ ఉంది అంటూ సమీర్ ప్రశంసలు గుప్పించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X