యాంకర్ శ్యామలకు సమీర్ కౌంటర్.. పవన్ అలా చేయడం నా కళ్లతో చూశా అంటూ!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. అంతలా ఆయన సుదీర్ఘ కాలంగా ఇటు సినిమా రంగంలోనూ, అటు రాజకీయాల్లోనూ సత్తా చాటుతూ దూసుకుపోతోన్నారు. దీనికితోడు ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి డిప్యూటీ సీఎంగానూ మారారు. ఇదంతా పక్కన పెడితే పవన్ కల్యాణ్ గురించి, ఆయన చేసే సాయం గురించి యాంకర్ శ్యామల కొద్ది రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై నటుడు సమీర్ స్పందించాడు. ఇంతకీ అతడు ఏమని మాట్లాడాడో మీరే చూడండి!
యాంకర్ శ్యామల కామెంట్:ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగిన తర్వాత నుంచే పిఠాపురంలో పవన్ కల్యాణ్ తప్పుకుండా విజయం సాధిస్తాడని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ పరిస్థితుల్లో పిఠాపురం నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ కాదని తెలుగు యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

సాయం చేయడం చూడలే:యాంకర్ శ్యామల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'పవన్ కల్యాణ్ గారు ఎప్పుడూ అరవడం, ఆవేశ పడడం మాత్రమే చూశా. ఆయన నలుగురికి సాయపడడం, సేవ చేయడం మాత్రం చూడలేదు. అందుకే ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోబోతున్నారు' అని వివరించారు. దీంతో యాంకర్ శ్యామల చేసిన చేసిన ఈ వ్యాఖ్యలు అప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
ఫ్యాన్స్ ఫైర్.. విన్ అయ్యాక:యాంకర్ శ్యామల.. పవన్ కల్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు అప్పుడు సెన్సేషన్ అయ్యాయి. దీంతో జనసేనికులు, మెగా ఫ్యాన్స్ ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం సాధించింది. అప్పుడు వాళ్లంతా మరింతగా యాంకర్ శ్యామలపై మాటల దాడి చేశారు. దీంతో ఆమె ఆ తర్వాత నుంచి పెద్దగా బయట కనిపించడం లేదు.

చూడకపోవడం నీ ప్రాబ్లం:జనసేన అధినేన పవన్ కల్యాణ్ మీద యాంకర్ శ్యామల చేసిన వ్యాఖ్యలపై సామాన్యులతో పాటు సెలెబ్రిటీలు సైతం స్పందిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రముఖ నటుడు సమీర్ మాట్లాడుతూ.. 'ఎవరో ఒక సో కాల్డ్ యాంకర్.. ఆమె ఎవరో అందరికీ తెలుసు. పవన్ కల్యాణ్ గారు సాయం చేయడం చూడలేదు అంటే.. అది ఆమె ప్రాబ్లం మాత్రమే' అని కౌంటర్ ఇచ్చాడు.

నేను కళ్లారా చూసి చెప్తున్నా:ఆ తర్వాత సమీర్ కంటిన్యూ చేస్తూ.. 'నేను ఒకసారి పవన్ కల్యాణ్ గారి ఆఫీస్‌కు వెళ్తే.. ఆయన పేపర్ చదువుతున్నారు. ఇది నేను కళ్లారా చూసి చెప్తున్నా. ఆ పేపర్లో రిక్షా తొక్కుకునే వ్యక్తి కూతురు నాకు చదువుకోవాలని ఉంది. ఎవరైనా సాయం చేయండి అని అడిగింది. పవన్ గారు వెంటనే మేనేజర్‌ను పిలిచి ఆమెకు సాయం చేశారు' అంటూ పవన్ క్యారెక్టర్ బయటపెట్టారు.


Click it and Unblock the Notifications











