పెళ్లి కోసం వెంటపడి, ‘గే’ ఫ్రెండుతో.... యాక్టర్ సామ్రాట్ కేసులో కొత్త విషయాలు!
భార్య ఫిర్యాదుతో దొంగతనం కేసులో అరెస్టయిన నటుడు సామ్రాట్ రెడ్డి కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడిని అరెస్టు చేసిన అనంతరం భార్య హర్షితా రెడ్డి పలు సంచలన విషయాలు బయట పెట్టారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో సామ్రాట్ విలువైన వస్తువులు, ఆభరణాలు దోచుకెళ్లాడని, అతడు ఒక 'గే' అని హర్షితా రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా హర్షిత తల్లి మీడియాతో మాట్లాడారు.

పెళ్లి కోసం వెంట పడ్డాడు
రెండేళ్ల క్రితం సామ్రాట్‌తో మా కూతురు పెళ్లి చేశాము, సినిమా వారికి మా బిడ్డను ఇవ్వడం ముందు నుండీ మాకు ఇష్టం లేదు. అయనా అతడు పలుసార్లు మా వెంట పడి ఒప్పించాడు, బిజినెస్ చేస్తాను, సినిమాలు మానేస్తాను అని మాయ మాటలు చెప్పాడని..... హర్షిత తల్లి మీడియాకు తెలిపారు.

పెళ్లయిన తర్వాత నిజస్వరూపం తెలిసింది
పెళ్లయిన కొద్దిరోజులకే అతడి నిజస్వరూపం బయటపడింది. అదనపు కట్నం కోసం వేధించేవాడు. దీంతో పాటు సామ్రాట్‌కు చాలా చెడు అలవాట్లున్నాయి....అని హర్షిత తల్లి తెలిపారు.
Recommended Video


‘గ్రే’ ఫ్రెండుతో తిరిగేవాడు
మా అల్లుడికి ఒక ‘గే' ఫ్రెండ్ ఉండేవాడు. హరితను పక్కన పెట్టుకుని కూడా రాత్రిపూట అమ్మాయిలతో చాటింగ్ చేసేవాడు. ఇలా జరిగిన కొద్దిరోజుల తర్వాత ఇద్దరికీ గొడవలయ్యాయి.... అని ఆమె తెలిపారు.

మరింత రెచ్చిపోయాడు
సామ్రాట్ తల్లిదండ్రులు, అక్కలు గానీ ఏ మాత్రం అతడిని అదుపులో పెట్టలేదు. అతడు ఏం చేసినా సపోర్టు చేసేవారు. వారి అండతో అతను మరింత రెచ్చిపోయి చెడు అలవాట్లకు బానిసయ్యాడు అని..... హర్షిత తల్లి తెలిపారు.

ప్రాణహాని ఉంది
ఇద్దరి గొడవ కోర్టుల వరకు వెళ్లింది. మా అమ్మాయికే రివర్స్‌గా నోటీసులు పంపారు. ఆ తర్వాత మధ్యవర్తి ద్వారా సమస్యను పరిష్కరిచుకోవాలని అనుకున్నాం. మా బిడ్డకు సామ్రాట్ నుంచి ప్రాణహానీ ఉంది..... అని హర్షిత తల్లి తెలిపారు.

చర్లపల్లి జైల్లో సామ్రాట్
సామ్రాట్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశించింది. సామ్రాట్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా... సామ్రాట్ రెడ్డి ‘గే' అని, డ్రగ్స్ అలవాటు ఉందని, అదనపు కట్నం కోసం తనను వేధింపుల పాలు చేసేవాడని, తన పేరిట ఉన్న ఆస్తులను అతని పేరుపైకి బదలాయించాలంటూ ఒత్తిడి చేసేవాడని అతని భార్య హర్షితా రెడ్డి, ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు.

సామ్రాట్ రెడ్డి వాదన ఇదీ
తనకు డ్రగ్స్ అలవాటు ఉందని తన భార్య హర్షిత, ఆమె కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని నటుడు సామ్రాట్ రెడ్డి తెలిపాడు. తనకు ఆ అలవాటే ఉంటే... పోలీసులకు ఎప్పుడో పట్టుబడేవాడినని చెప్పాడు. తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని అన్నాడు.

నేను చేసింది తప్పే
ఇంట్లో నుంచి డబ్బు, నగలు దొంగలించానని హర్షిత ఆరోపిస్తోందని... అందులో కూడా వాస్తవం లేదని తెలిపాడు. తన ఇంట్లో తనకు కావాల్సిన వస్తువులను మాత్రమే తాను తీసుకున్నానని చెప్పాడు. కోపంలో సీసీ కెమెరాలను ధ్వంసం చేశానని, అది తప్పే అని సామ్రాట్ రెడ్డి తెలిపారు.

మీడియా ముందుకు సామ్రాట్ తల్లి
భార్య ఫిర్యాదుతో అరెస్టయిన సినీ నటుడు సామ్రాట్ రెడ్డి తల్లి జయరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇద్దరి మధ్య సరైన అండర్ స్టాండింగ్ లేకనే ఈ గొడవ మొదలైందన్నారు. హర్షిత రెడ్డి తల్లిదండ్రులు కూడా కూతురికి సహకరిస్తూ అల్లుడిని తీవ్ర పదజాలంతో మాట్లాడేవారని, దీంతో సామ్రాట్ తనకు విడాకులు కావాలని చెప్పాడని ఆమె తెలిపారు.

నా కొడుకు మీద ఏ ఫిర్యాదు రాలేదు
పదేళ్ల నుంచి అతడు సినీ పరిశ్రమలో ఉన్నాడని, ఇంతవరకు తన కొడుకుపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదన్నారు. సామ్రాట్‌కు ఎలాంటి చెడు అలవాట్లు లేవని ఆమె స్పష్టంచేశారు. తన కొడుకు సామ్రాట్ ఉంటున్న ఇంట్లో తనకు చెందిన వస్తువులు తీసుకుంటే తప్పేంటని జయరెడ్డి ప్రశ్నించారు. ఆ ఇంట్లో సామ్రాట్‌కు తెలియకుండా సీసీ కెమెరాలు పెట్టడంతో ఆగ్రహానికి లైనై వాటిని ధ్వంసం చేసినట్టు ఆమె తెలిపారు.


Click it and Unblock the Notifications











