twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీవితాంతం మానాన్న ఒకే డ్రస్‌లో.. న్యాయం చేస్తున్నా.. పవన్ వల్లనే.. సప్తగిరి (ఇంటర్వ్యూ)

    By Rajababu
    |

    Recommended Video

    న్యాయం చేస్తున్నా.! పవన్ వల్లనే | Filmibeat Telugu

    టాలీవుడ్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఆ తర్వాత కమెడియన్‌గా మారి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. దాదాపు 70కు పైగా చిత్రాల్లో నటించిన తర్వాత సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో హీరోగా మారాడు. ఆ చిత్రం అందించిన విజయ స్ఫూర్తితో మళ్లీ హీరోగా సప్తగిరి ఎల్‌ఎల్‌బీ చిత్రంతో ముందుకొస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 7న రిలీజ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో సప్తగిరి మీడియాతో మాట్లాడారు. సప్తగిరి వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..

     సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో మంచి పేరు

    సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో మంచి పేరు

    సప్తగిరి ఎక్స్‌ప్రెస్ చిత్రం నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నా నిర్మాతను సేఫ్ జోన్‌లోకి తీసుకెళ్లింది. మళ్లీ అదే కాంబినేషన్‌లో మంచి సినిమా చేయాలని చేసిన ప్రయత్నమే సప్తగిరి ఎల్ఎల్‌బీ చిత్రం. హిందీలో నటుడు అర్షద్ వార్షి చేసిన పాత్రను నేను చేస్తున్నాను. ఈ సినిమా భావోద్వేగంతోపాటు ప్రేక్షకుడు ఉత్కంఠకు లోనవ్వడం ఖాయం.

     పోలీసు కథతో ఎక్స్‌ప్రెస్

    పోలీసు కథతో ఎక్స్‌ప్రెస్

    నిజాయితీపరులైన పోలీసుల జీవన స్థితిగతులు, వారి ఎదుర్కొనే సమస్యలను ఆధారంగా చేసుకొని సప్తగిరి ఎక్స్‌ప్రెస్ చిత్రాన్ని నిర్మించాం. ఎండనక, వాననక విధులను నిజాయితీగా తెరపై చూపించాం. కమెడియన్‌గా నటిస్తూ తొలిసారి హీరోగా మారి ఆ చిత్రంలో నటించాను. అది మంచి విజయాన్ని ఇచ్చింది.

     సగటు లాయర్ కథతో

    సగటు లాయర్ కథతో

    సప్తగిరి ఎక్స్‌ప్రెస్ అందించిన విజయం స్ఫూర్తితో సగటు జీవి, ఓ నిజాయితీపరుడైన లాయర్ కథా నేపథ్యంగా సప్తగిరి ఎల్ఎల్‌బీ తీశాం. ఈ సినిమా హిందీలో ఘన విజయం సాధించిన జాలీ ఎల్ఎల్‌బీ చిత్రానికి రీమేక్. బోమన్ ఇరానీ చేసిన క్యారెక్టర్‌ను సాయికుమార్, సౌరభ్ శుక్లా పాత్రను ఎంపీ శివప్రసాద్ రెడ్డి పోషించారు. ఈ చిత్రంలో సాయికుమార్, శివ ప్రసాద్ రెడ్డి ముగ్గురు హీరోలే. నిర్మాత రవికిరణ్ ఈ చిత్రంలో నాకు బావ పాత్రను పోషించాడు.

     అందరికీ న్యాయం

    అందరికీ న్యాయం

    జాలీ ఎల్ఎల్‌బీ కథలో 20 శాతం మెయిన్ థీమ్‌ను తీసుకొని తెలుగు సినిమా నేటివిటికి తగినట్టుగా సప్తగిరి ఎల్ఎల్‌బీ చిత్రాన్ని రూపొందించాం. కుల, మత, ధనిక, పేద అనే తేడా లేకుండా న్యాయం దక్కాలే అనే ఓ చిన్న లాయర్ చేసిన పోరాటమే సప్తగిరి ఎల్ఎల్‌బీ చిత్ర కథ.

     లాయర్లకు అంకితం

    లాయర్లకు అంకితం

    సప్తగిరి ఎక్స్‌ప్రెస్ చిత్రాన్ని నిజాయితీపరులైన పోలీసులకు అంకితం ఇస్తే.. సప్తగిరి ఎల్ఎల్‌బీ చిత్రాన్ని నిజాయితీ పరులైన లాయర్లకు అంకితం ఇస్తున్నాం. ఈ చిత్రంలో భారీ డైలాగ్స్ ఉండవు. నా స్థాయికి తగినంత మేరకే డైలాగ్స్ ఉంటాయి. నేను భారీ డైలాగ్స్ కొడితే ప్రేక్షకులు ఒప్పుకోరు.

     సప్తగిరి ఎల్‌ఎల్‌బీ సమిష్టి నిర్ణయం

    సప్తగిరి ఎల్‌ఎల్‌బీ సమిష్టి నిర్ణయం

    సప్తగిరి ఎక్స్‌ప్రెస్ తర్వాత ఎలాంటి చిత్రాన్ని చేయాలని ఆలోచిస్తున్నప్పడు జాలీ ఎల్ఎల్‌బీ అయితే బాగుంటుందని నిర్మాత రవికిరణ్, ఇతర సభ్యులందరం సంయుక్తంగా నిర్ణయం తీసుకొన్నాం.

     నా నిర్ణయం కరెక్టే

    నా నిర్ణయం కరెక్టే

    కమెడియన్ నుంచి హీరో పాత్రలు చేయడం సరైనదే. నా నిర్ణయానికి ప్రేక్షకులు కూడా మద్దతు తెలిపారు. 70 సినిమాల్లో చేసిన కమెడియన్ సప్తగిరి కెరీర్‌లో వేరియేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో హీరోగా మారాను. ఏదిమైనా నేను ఫైటర్‌ను.. నేను తీసుకొన్న నిర్ణయం తప్పుకాదని నిరూపించుకోవడానికి ఫైట్ చేస్తాను.

     పవన్‌ కల్యాణ్ మార్చేశాడు..

    పవన్‌ కల్యాణ్ మార్చేశాడు..

    సప్తగిరి పేరుతో టైటిల్‌ పెట్టడం వెనుక కథ తెలుసు. నా మొదటి సినిమాకు కాటమరాయుడు అనే టైటిల్ పెట్టుకొన్నాం. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అడగడంతో ఆ టైటిల్‌ను ఇచ్చేశాం. ఆ తర్వాత టైటిల్ ఏమి పెడుదామని ఆలోచిస్తున్న తరుణంలో.. నీ స్పీడ్‌గా ఉంటావు. నీ సినిమాకు సప్తగిరి ఎక్స్‌ప్రెస్ అని పేరు పెడుదామని అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పడంతో ఆ టైటిల్ అలా ఖరారైంది. ఇప్పుడు జాలీకి బదులుగా సప్తగిరిని తగిలించాం.

     అని కథలు సప్తగిరి చుట్టే

    అని కథలు సప్తగిరి చుట్టే

    సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమా తర్వాత అన్ని సప్తగిరి పేరుతో కథలు చెబుతున్నారు. సప్తగిరి వెడ్స్ సన్నీలియోన్, సప్తగిరి ఎంబీబీఎస్, సప్తగిరికి దయ్యంపట్టింది లాంటి టైటిల్స్‌తో కథలు వినిపిస్తున్నారు. రీమేక్ చిత్రాలే చేద్దామని అందరూ సజెస్ట్ చేస్తున్నారు.

     అమ్మా, నాన్నలకు న్యాయం

    అమ్మా, నాన్నలకు న్యాయం

    నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. 25 ఏళ్లు మధ్య తరగతి బాధలు చూశాను. మా నాన్న పోలీస్. ఓ ఖాకీ పాయింట్, షర్ట్‌లోనే నా జీవితమంతా చూశాను. అందుకే నా సినిమాలో మధ్య తరగతి కుటుంబ అంశాలు కనిపిస్తాయి. జీవితాంతం కష్టపడిన మా అమ్మకు, మా నాన్నకు ఏమి కావాలో అన్ని సమకూరుస్తున్నాను. వారి సంతోషం కంటే నాకేమీ ఎక్కువ ఉండదు అని సప్తగిరి వెల్లడించారు.

    English summary
    After success of Saptagiri Express, Hero Saptagiri coming with his latest movie is Saptagiri LLB. This movie is remake for Hindi movie Jolly LLB. This movie is set to release on December 7th. In this occassion, Saptagiri speaks to Telugu Filmibeat exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X