RRR మూవీలో ఆ హీరోకి తీరని అన్యాయం చేసిన రాజమౌళి!
దర్శకదీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆయన తన రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో రాజమౌళి చేసింది 12 చిత్రాలే. అయినా.. ఎవరు అందుకోలేని రికార్డులు క్రియేట్ చేశారు. అపజయం ఎరుగని దర్శకుడిగా నిలిచారు. తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేశారు. ఆయన
తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీతో మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులర్టీ సంపాదించుకున్నారు. ఈ మూవీకి ఆస్కార్ అవార్డుతో పాటు అనేక అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. అయితే.. సినిమాలో ఓ నటుడుకి మాత్రం చాలా అన్యాయం చేశారంట. ఇంతకీ ఆ హీరో ఎవరు? అసలేం జరిగింది?
ఆ హీరో ఎవరు కాదు.. యాక్టర్ సత్యదేవ్ (Satya Dev) కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ తరుంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, అత్తారింటికి దారేది వంటి సినిమాల్లో సత్యదేవ్ కీలకపాత్రలో కనిపించాడు. ముకుంద సినిమాలో కూడా ఓ ప్రధాన పాత్రలో కనిపించాడు సత్యదేవ్. ఈ తరుణంలో పూరి జగన్నాథ్ కంటబడ్డారు. జ్యోతిలక్ష్మి సినిమా లో హీరోగా నటించి.. మంచి గుర్తింపు సాధించుకున్నాడు. ఆ తరువాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, కృష్ణమ్మ, బ్లఫ్ మాస్టర్ (Bluff Master) వంటి సినిమాల్లో హీరోగా నటించి మెప్పించాడు సత్యదేవ్.

ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు.. స్టార్ హీరోల సినిమాల్లో లీడ్ రోల్స్ లో నటించారు సత్యదేవ్. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ (God Father) సినిమాలో విలన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాతో సత్యదేవ్ కి పాపులరిటీ పెరిగింది. ఇలా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సత్యదేవ్. తాజాగా జీబ్రా (Zebra)అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 22న విడుదల కాబోతుంది. రిలీజ్ తేదీ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పలు రకాల ఇంటర్వ్యూ, టీవీ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్నాడు.
తాజా ఓ ఇంటర్వ్యూలో సత్య దేవ్ మాట్లాడుతూ.. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR)మూవీలో తాను కూడా నటించాననీ, కానీ, తాను నటించి సీన్లన్నీ లేపేశారని మొహమాటపడుతూనే బయటపెట్టాడు. ఆర్ఆర్ఆర్ మూవీ కోసం తాను పది రోజులు షూటింగ్ చేశానని, దాదాపు 16 నిమిషాల ఫుటేజ్ ను సినిమా నుండి తొలగించారని తెలిపారు. తాను నటించిన పాత్ర ఆ మూవీకి సరిగా సెట్ కాలేదని, తాను నటించిన సీన్స్ ను పూర్తి లేపేసారని తెలిపారు సత్య దేవ్.

ఆ మూవీ మేకర్స్ పై ఉన్న గౌరవంతో ఈ విషయాన్ని ఇప్పుడు ఎక్కడ ప్రస్తావించలేదని అన్నారు.కాకపోతే ఆ పది రోజులు వారితో పనిచేసిన అనుభవాన్ని తాను ఎప్పుడూ మర్చిపోవాలని అన్నారు సత్యదేవ్. ఈ మూవీలో కాకపోతే మరో మూవీ రాజమౌళితో వర్క్ చేసే అవకాశం వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం సత్య దేవ్ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఆయన ఏ సీన్స్ చేశారని, ఆయన క్యారెక్టర్ ఏంటీ? అని
అభిమానులు, నెటిజన్లు అడుగుతున్నారు. కనీసం డిలీటెడ్ సీన్స్ అయినా సోషల్ మీడియాలో పోస్ట్ చేయవచ్చగా.. నిజంగా సత్య దేవ్ కి రాజమౌళి అన్యాయం చేయరంటూ నెట్టిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











