»   » నరేష్ బర్త్ డే వేడుకల్లో సూపర్ స్టార్ కష్ణ (ఫోటోస్)

నరేష్ బర్త్ డే వేడుకల్లో సూపర్ స్టార్ కష్ణ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నటుడు నరేష్ పుట్టినరోజు వేడుకలు బుధవారం అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా జరిగాయి. ఈ వేడుకలకు నరేష్ తల్లి విజయ నిర్మల, సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, శివాజీ రాజా తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కృష్ణ మాట్లాడుతూ...నరేష్ తన కెరీర్లో ఎక్కువగా కామెడీ సినిమాలు చేసినప్పటికీ సాహసమే నా ఊపిరి లాంటి యాక్షన్ సినిమాలు కూడా చేసారు. ఇపుడు సెకండ్ ఇన్సింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్టార్ డమ్ తెచ్చుకున్నారు. నరేష్ మరిన్ని మంచి పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

నరేష్ మాట్లాడుతూ... కృష్ణ గారు, అమ్మ విజయ నిర్మల ఇద్దరు నా కెరీర్ కు రెండు పిల్లర్స్ లా నిలిచారు. ప్రస్తుతం కెరీర్ చాలా హ్యాపీగా సాగుతోంది. మహేష్ తో నటించాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. బ్రహ్మోత్సవం సినిమాతో అది నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో తొలిసారిగా ‘అ ఆ' సినిమాలో నదితో కలిసి చేస్తున్నాను. సినిమాకు మలుపు తిప్పే కీ రోల్ చేస్తున్నాను. ఆదితో కలిసి చేసిన ‘గరం' త్వరలో రిలీజవుతోంది. అలాగే కొత్త దర్శకురాలు చూనియా దర్శకత్వంలో ‘పడేసావే' చిత్రంలో చేస్తున్నాను. కృష్ణ గారు నటిస్తున్న ‘శ్రీ శ్రీ'లో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నాను. ఈ ఏడాది నాకు నటుడిగా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. మాబ్బాయి నవీన్ నటిస్తున్న ‘ఐనా ఇష్టం నువ్వు' ఈ సంవత్సరం రిలీజ్ అవుతుంది అన్నారు.

నరేష్ బర్త్ డే
  

నరేష్ బర్త్ డే

నటుడు నరేష్ పుట్టినరోజు వేడుకలు బుధవారం అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా జరిగాయి

కృష్ణ
  

కృష్ణ

నరేష్ కు కేక్ తినిపిస్తున్న సూపర్ స్టార్ కృష్ణ.

గజమాలతో...
  

గజమాలతో...

నరేష్, విజయ నిర్మల, కృష్ణలను గజమాలతో సత్కరిస్తున్న దృశ్యం.

నరేష్ భార్య
  

నరేష్ భార్య

నరేష్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన భార్య.

సహచరులు
  

సహచరులు

నరేష్ పుట్టినరోజు వేడుకల్లో రాజేంద్రప్రసాద్, శివాజీ రాజా తదితరులు పాల్గొన్నారు.

 

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu