twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాద్‌ షా' రికార్డులు సృష్టిస్తుంది: షఫీ

    By Srikanya
    |

    బి.కొత్తకోట: జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న బాద్‌షా ఘన విజయం సాధిస్తుందని సినీ నటుడు షఫీ ధీమా వ్యక్తం చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హార్సిలీహిల్స్‌సమీప గ్రామమైన నాయనబావికి రాత్రి షఫీ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ తాను బాద్‌షాలో మంచి పాత్రను పోషిస్తున్నానని, బలుపు, సహస్త్ర సినిమాలు నిర్మాణదశలో ఉన్నాయన్నారు.

    కన్నడలో నిర్మిస్తున్న డర్టీ పిక్చర్‌ సినిమాలో వైవిధ్య భరితమైనపాత్ర దొరికిందని, త్వరలోనే ఈ సినిమా విడుదల కానుందన్నారు. చిరంజీవి మేనల్లుడితో గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తున్న సినిమాలోనూ నటనకు ఆస్కారమున్న వేషం వేస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై తనకు ప్రత్యేక ఆసక్తి ఉందని, త్వరలోనే జీవ వైవిధ్యంపై మదనపల్లెలో ఓ సదస్సు నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిపారు.

    ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం 'బాద్‌షా'. ఈ చిత్రం బడ్జెట్ ఇప్పటికే యాభై కోట్లు పై చిలుకు అయ్యిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరో ప్రక్క ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు వాడిన సూట్ ఖరీదు హాట్ టాపిక్ గా మారింది. ఈ సూట్ ని ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేసారని, మీటర్ కి ఒక లక్ష ఖర్చైందని చెప్తున్నారు. కేవలం ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు వాడిన కాస్ట్యూమ్స్ కాస్ట్ ..మూడున్నర కోట్లు ఖర్చైందని చెప్పుకుంటున్నారు.

    ఇక ఈ చిత్రం బడ్జెట్ ఇప్పటికే 55 కోట్లు దాటిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ట్రేడ్ లో ఈ చిత్రానికి ఏ రేంజిలో బిజినెస్ జరగనుందనే విషయంపై చర్చలు ఓ రేంజిలో జరుగుతున్నాయి. ఎన్టీఆర్ పై అంత బడ్జెట్ వర్కవుట్ అవుతుందా అని కొందరు సందేహం వ్యక్తం చేసినా, శ్రీను వైట్ల కాంబినేషన్ కాబట్టి నష్టముండదు అంటున్నారు.

    English summary
    Actor Shafi says that Ntr's latest Baadshah film will be super hit and create records.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X