twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రమాదానికి గురైన హీరో శర్వానంద్... థాయ్‌లాండ్ నుంచి హైదరాబాద్ తరలింపు

    |

    యువ హీరో శ‌ర్వానంద్‌ ప్రమాదానికి గురయ్యారు. 96 షూటింగ్‌లో భాగంగా థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. గాలి ఎక్కువ‌గా రావ‌డంతో ల్యాండింగ్ స‌మ‌యంలో ఇబ్బంది ఏర్పడిందని, సరిగా ల్యాండ్ కాకపోవడంతో భుజానికి తీవ్రగాయం కావడంతో పాటు కూడా ఫ్రాక్చ‌ర్ అయ్యింది.

    వెంటనే శ‌ర్వానంద్‌ను థాయ్‌లాండ్ నుంచి హైద‌రాబాద్ తరలించారు. ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా సన్ షైన్ హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారు. భుజానికి బ‌ల‌మైన గాయం అయిందని, శస్త్ర చికిత్స అవ‌స‌రమ‌ని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. సోమ‌వారం సర్జరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    ప్రమాదం ఎలా జరిగిందంటే..

    ప్రమాదం ఎలా జరిగిందంటే..

    నిపుణులైన ట్రైన‌ర్స్ ఆధ్వ‌ర్యంలో మొదటి రెండు రోజుల శిక్షణ బాగానే జరిగింది. అయితే మూడో రోజు ప్రాక్టీస్‌లో అపశృతి చోటు చేసుకుంది. మొదటి నాలుగు సార్లు సేఫ్‌గా ల్యాండ్ అయినప్పటికీ 5వసారి ల్యాండ్ అయ్యే సమయంలో గాలి ఎక్కువ‌గా రావ‌డంతో కాళ్ల‌పై కాకుండా భుజాలు బలంగా భూమికి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

    కొన్ని రోజులు ఆసుపత్రిలోనే

    కొన్ని రోజులు ఆసుపత్రిలోనే

    ఈ ప్రమాదంలో శర్వానంద్ షోల్డర్ బోన్ డిస్ లొకేట్ అయిట్టు తెలుస్తోంది. భుజానికి బలమైన గాయం కావడంతో శ‌స్ర‌చికిత్స అవసరమని వైద్యులు సూచించారట. సోమవారం సర్జీర తర్వాత కొన్ని రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఆసుపత్రిలోనే ఉంటారని తెలుస్తోంది.

    96 మూవీ రీమేక్

    96 మూవీ రీమేక్

    తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన హిట్ మూవీ ‘96'... తెలుగులో శర్వానంద్, సమంత జంటగా రీమేక్ అవుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో 96 చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సి.ప్రేమ‌కుమార్ తెలుగు రీమేక్‌ను కూడా తెర‌కెక్కించ‌బోతున్నారు.

    షూటింగ్‌పై ప్రభావం

    షూటింగ్‌పై ప్రభావం

    శర్వానంద్ యాక్సిడెంట్ కారణంగా ఆసుపత్రి పాలవ్వడం, శస్త్ర చికిత్స తర్వాత కనీసం నెల రోజులు విశ్రాంతి తీసుకునే పరిస్థితి ఉండటంతో సినిమా షూటింగుపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అంశాలపై ఓ క్లారిటీ రానుంది.

    English summary
    Actor Sharwanand injured in 96 shooting. Sharwanand is an Indian film actor known for his works in Telugu cinema and a few Tamil films. In 2012, Sharwanand received the Best Male Debut award for his work in the blockbuster Engeyum Eppodhum at the 1st South Indian International Movie Awards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X