పూనమ్ కౌర్, జానీ మాస్టర్ వివాదాలు.. వాస్తవాలు వెల్లడించిన శివ బాలాజీ
Shiva Balaji: హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె సినిమాల కంటే కంట్రవర్సీతోనే ఫేమస్ అయింది. సమయం దొరికితే చాలు తన కాంట్రవర్సీ ట్విట్లతో రెచ్చిపోతుంది. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉంటుంది. తనకు అన్యాయం జరిగిందని మా అసోసియేషన్ కూడా పట్టించుకోవడం లేదంటూ సంచలన ఆరోపణలు చేస్తుంటుంది.పూనమ్ కౌర్ ఆరోపణలపై టాలీవుడ్ నటుడు శివ బాలాజీ షాకింగ్ కామెంట్స్ చేశారు.
హీరోయిన్ పూనమ్ కౌర్ చేసింది తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలకు దూరంగా ఉంటున్న పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ.. తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. ఈ అమ్మడు పరోక్షంగా డైరెక్టర్ త్రివిక్రమ్‌పై ట్వీట్లు చేస్తోంది. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ..అవకాశం చిక్కినప్పుడల్లా త్రివిక్రమ్‌లపై మండిపడుతుంటుంది. త్రివిక్రమ్ మీద తాను చేసిన కంప్లైంట్‌ను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీసుకుంటుందా? అని ప్రశ్నించారు.

పూనమ్ వ్యాఖ్యలపై నటుడు, మా అసోసియేషన్‌కు కోశాధికారి శివ బాలాజీ స్పందించారు. ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ పూనమ్ కౌర్ పై షాకింగ్ కామెంట్ చేశారు శివబాలాజీ. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న నటి పూనమ్ కౌర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. ఇప్పుడనే కాదు.. గతంలో కూడా ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. ఎన్నో రోజుల నుంచి త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ ఆరోపణలు చేసినప్పటికీ .. తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదనీ, తాను గతంలో నీ రికార్డులను కూడా చూశానని ఎక్కడ కూడా పూనం కౌర్ ఫిర్యాదు చేసినట్లు లేదన్నారు.
అలాగే జానీ మాస్టర్ ఇష్యూపై కూడా శివ బాలాజీ మాట్లాడుతూ.. ఈ వివాదానికి కూడా త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో మహిళలే కాదు పురుషులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కానీ ఆ విషయం బయటకు రావడం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అవసరాల కోసం దగ్గరవుతారు. అన్నీ బాగున్నప్పుడు అన్నీ చేసేసుకోని ఆ తర్వాత ఏమైనా గొడవ జరిగితే.. రేప్ కేసులు పెడుతున్నారని షాకింగ్ కామెంట్స్ చేస్తారు. తనకు తెలిసినంత వరకు ఆడ వాళ్లు పెడుతున్న కేసుల్లో 60 శాతం కేసులు తప్పుడ కేసులు పెడుతున్నారని అన్నారు. చట్టాలన్ని మహిళలకే అనుకూలంగా ఉన్నాయి. వాటిని ఆసరాగా చేసుకుని .. మగవాళ్లపై టార్గెట్ చేస్తున్నారీ, తప్పు కేసులు పెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ పునమ్ ఆరోపణలపై శివ బాలాజీ భార్య మధుమిత కూడా స్పందించారు. తాను చిన్న వయసులో ఇండస్ట్రీకి వచ్చాననీ, తన 20 ఏళ్ల అనుభవంతో చెప్తున్నంటూ..' ఓసారి నేను ఓ సినిమాకు డబ్బింగ్ వెళ్లాడు. అందులో ఐ లవ్యూ అనే డైలాగ్ చెప్పాల్సి ఉంది. ఆ డైలాగ్ చెప్పగానే ఆ మూవీ డైరెక్టర్ వచ్చి.. నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో నేను షాక్ అయ్యి.. నో చెప్పాను. ఆడదానికి మగవాళ్లు సహజంగానే ఆకర్షితుడవుతారు. కానీ చూసే చూపులు.. చేసే చేష్టలను బట్టి మనం ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలన్నారు. ఫ్రెండే కదా అని వారితో బయటికి వెళ్లడం కూడా నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు' అని తెలిపారు.


Click it and Unblock the Notifications











