twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో శివాజీకి బిగిస్తున్న ఉచ్చు.. అలంద కేసులో అరెస్ట్ చేశాం.. సైబర్ క్రైం

    |

    అలంద మీడియా కేసులో టాలీవుడ్ హీరో శివాజీకి ఉచ్చు బిగిసింది. ఈ కేసులో కీలకమైన శివాజీ విదేశాలకు పారిపోతుండగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్‌ పరిధిలోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు ఆయనను తరలించారు. అమెరికా పారిపోతుండగా హీరో శివాజీని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తున్నది. గతంలో ఆయనకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.

    శివాజీ అరెస్ట్‌పై సైబరాబాద్ పోలీసులు స్పందిస్తూ.. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించగా అరెస్ట్ చేశాం. కోర్టు ఆదేశాల ప్రకారం సెక్షన్ 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశాం. విచారణకు హాజరకావాలని, సహకరించాలని కోరాం. కానీ మా నోటీసులకు, రిక్వెస్ట్‌కు స్పందించలేదు. చట్టప్రకారం శివాజీని విచారిస్తాం అని తెలిపారు.

     Actor Shivaji arrested Alanda Media Case

    అలంద మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌ను ఇప్పటికే హైదారాబాద్ పోలీసులు విచారించారు. తాజాగా శివాజీ అరెస్ట్‌తో ఈ కేసులో విచారణ వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ఆపరేషన్ గరుడ అనే అంశంతో శివాజీ మీడియాలోను, సోషల్ మీడియాలోనే హంగామా చేసిన సంగతి తెలిసిందే.

    అలంద కేసులో రవి ప్రకాశ్‌తన సంతకాన్ని ఫోర్టరీ చేశరని సంస్థ కార్యదర్శి కౌశిక్ రావు కంప్లయింట్ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా నిధులను దారి మళ్లించారని ఆలందా మీడియా ఆరోపణలు చేసింది. ఈ ఫిర్యాదు నేపథ్యంలో రవి ప్రకాశ్‌, సినీ హీరో శివాజీకి కూడా నోటీసులు జారీ చేశారు. గత కొద్దికాలంగా మీడియాకు, పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న శివాజీ బుధవారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు.

    Read more about: ravi prakash
    English summary
    Actor Shivaji arrested in Alanda Media Case at Shamshabad Airport on July 7th morning. Cyberpolice are confirmed Actor Shivaji Arrest. They said.. as per the rules, Investigation will go.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X