twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘వెన్ను పోటు’ సాంగ్ వివాదం: నేనే ప్రత్యక్ష సాక్షి... రామ్ గోపాల్ వర్మకు శివాజీ కౌంటర్!

    |

    దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన 'వెన్నుపోటు' సాంగ్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఎన్టీ రామారావును ఆయన అల్లుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఎత్తి చూపే విధంగా ఈ పాట చిత్రీకరించారు అంటూ టీడీపీ శ్రేణులు మండి పడుతున్నాయి.

    తాజాగా ఈ వివాదంపై నటుడు శివాజీ స్పందించారు. ''లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది లక్ష్మి పార్వతి జీవితానికి సంబంధించిన సినిమా. అందులో రామారావుగారి పాత్ర ఏమిటనేది చెబుతాడనుకుంటా నాకైతే తెలియదు. ఇటీవల విడుదలైన సాంగ్ విన్నతర్వాత నాకు ఒకటే అనిపించింది. వెన్ను పోటుకు, వెన్ను దన్నుకు తేడా తెలియని ఒక మనిషి ఈ సినిమా తీస్తున్నాడనిపిస్తుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.'' అని తెలిపారు.

    రాముడు ఎలా చేశాడో...

    రాముడు ఎలా చేశాడో...

    రామాయణంలో రాముడు వాలిపై చెట్టు చాటు నుంచి బాణం వేసినపుడు దాని వెనక ఉన్న పరమార్థం వేరు. సుగ్రీవుడి భార్యను చెరపట్టి రాజ్యాన్ని తన అధీనంలోకి తీసుకుని తమ్ముడిని రాజ్య బహిష్కరణ చేశాడు. అపుడు రాముడు అది ధర్మం కాదని చెప్పి ధర్మానికి అనుకూలంగా నిలబడ్డాడు. చంద్రబాబు నాయుడు కూడా అలాగే చేశారు.. ఆ రోజు తెలుగు దేశం పార్టీ ఉన్న పరిస్థితికి, లక్ష్మీ పార్వతి ఆ పార్టీని కబ్జా చేయాలనుకున్నారు కాబట్టి, యావత్ పార్టీ అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకుని, పార్టీని, రాష్ట్రాన్ని సేవ్ చేయడానికి వైస్ రాయ్ హోటల్ లో ఆ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అది వెన్నుపోటు కాదు వెన్ను దన్ను... అని శివాజీ అభిప్రాయ పడ్డారు.

    ‘వెన్నుపోటు' వివాదం: థాంక్స్ చెబుతూ మళ్లీ రెచ్చగొట్టిన రామ్ గోపాల్ వర్మ ‘వెన్నుపోటు' వివాదం: థాంక్స్ చెబుతూ మళ్లీ రెచ్చగొట్టిన రామ్ గోపాల్ వర్మ

    నేను ప్రత్యక్ష సాక్షిని

    నేను ప్రత్యక్ష సాక్షిని

    వైస్ రాయ్ సంఘటన జరిగినపుడు నేను హైదరాబాద్‌ వైస్ రాయ్ వద్దనే ఉన్నాను. పొట్ట కూటి కోసం హైదరాబాద్ వచ్చాను. ఆ రోజున అదే చైతన్య రథం మీద చెప్పులు విసిరిన మనిషి కూడా లక్ష్మీపార్వతికి సంబంధించిన మనిషే. ఆ రోజు పరిటాల రవి బస్సుమీద నుంచి దూకారు. ఆ మనిషిని చూసిన తర్వాత వెనక్కి వెళ్లిపోయారు. చంద్రబాబు చేసింది వెన్నుపోటు కాదు.. వెన్ను దన్ను అని శివాజీ నొక్కి వక్కానించారు.

    లక్ష్మీస్ ఎన్టీఆర్

    లక్ష్మీస్ ఎన్టీఆర్

    రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' ఎన్టీ రామారావు జీవితంలోని పలు వివాదాస్పద అంశాల ఆధారంగా రూపొందుతోంది. రామారావు జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

    మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి.. మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..

    ఎన్టీఆర్ బయోపిక్-ఇటు లక్ష్మీస్ ఎన్టీఆర్

    ఎన్టీఆర్ బయోపిక్-ఇటు లక్ష్మీస్ ఎన్టీఆర్

    ఓ వైపు ఎన్టీ రామారావు జీవితంపై ఎన్టీఆర్ బయోపిక్ వస్తుండగా... అందులో చూపించని వివాదాస్పద అంశాలతో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. మరి ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

    English summary
    Actor Shivaji Counter to RGV about Lakshmi's NTR Movie Controversy. Lakshmi's NTR is an upcoming Indian Telugu, biographical drama film based on the real life of former chief minister of undivided Andhra Pradesh N. T. Rama Rao. It is directed by Ram Gopal Varma and produced by ysr congress leader from Chittoor Rakesh Reddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X