రైతులూ, నిర్మాతలు ఇలా చావకూడదు: నిర్మాత మృతిపై ఆవేదనగా సిద్దార్థ్

ప్రముఖ తమిళ దర్శక, నిర్మాత బి.అశోక్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డారు. చెన్నైలోని అళ్వార్‌ తిరునగర్ లోని తన నివాసంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.

ప్రముఖ తమిళ దర్శక, నిర్మాత బి.అశోక్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డారు. చెన్నైలోని అళ్వార్‌ తిరునగర్ లోని తన నివాసంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. గత ఏడేళ్లుగా ఆయన సినిమాలకు ఫైనాన్సియర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తులు తమ డబ్బులు తిరిగివ్వాల్సిందిగా బెదిరిస్తుండటమే ఈ ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.

ప్రముఖ నటుడు

ప్రముఖ నటుడు

అశోక్ కుమార్ ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత శశికుమార్ కు బంధువు. శశికుమార్ నిర్మాణంలో తెరకెక్కిన ఇసన్, పొరలి సినిమాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. వీరి నిర్మాణంలో తెరకెక్కిన కోడి వీరం రిలీజ్ సిద్ధంగా ఉంది. అశోక్ కుమార్ మృతి పట్ల పలువురు తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Recommended Video

Siddarth Says 'It's A New Experiment Everyone Like It'
సూసైడ్‌ నోట్‌

సూసైడ్‌ నోట్‌

అప్పు ఇచ్చిన వ్యక్తులు తిరిగి చెల్లించమని వేధిస్తుండడంతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని సూసైడ్‌ నోట్‌ ఆధారంగా విచారణ చేప‌డుతున్నారు.

వేధింపులు

వేధింపులు

ప‌లు సినిమాల‌కి స‌హా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన అశోక్‌కి అప్పిచ్చిన‌వారి నుండి వేధింపులు ఎక్కువ కావ‌డంతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డి ఉంటార‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. ఆయ‌న మృతి ప‌ట్ల కోలీవుడ్ సినీ పరిశ్ర‌మ సంతాపం వ్య‌క్తం చేస్తూ , ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని కోరారు.

న‌టుడు సిద్ధార్ద్

న‌టుడు సిద్ధార్ద్

ఇక ప్ర‌ముఖ న‌టుడు సిద్ధార్ద్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా .. రైత‌న్న కాని , మ‌రో నిర్మాత కానీ ఇలా ఆత్మ‌హ‌త్య చేసుకొని చ‌నిపోకూడ‌ద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. యువ నిర్మాత అప్పుల కార‌ణంగా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం విన‌డానికి బాధ‌గా ఉంది.

సిస్టమ్ మారాలి

సిస్టమ్ మారాలి

తమిళ్ సినిమా పూర్తిగా అప్పుల్లో ఉంది కానీ ప్రపంచమంతా సక్సెస్.. ఫేమ్ గురించి అబద్ధం చెప్తున్నామని భావిస్తోంది. ఈ సిస్టమ్ మారాలి. శ‌శికుమార్ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాన‌ని సిద్ధార్ద్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X