మహేష్-పవన్ కళ్యాణ్ లకు జై కొడుతున్న: లవర్ బాయ్
స్టార్ హీరోల సినిమాలు ఎలా ఉన్నా కానీ ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. చిన్న హీరోల సినిమాలు ఎంత బాగున్నా ఆర్థికంగా నష్టపోతాయి. కానీ మిడిల్ క్లాస్ హీరోల సినిమాలే ఎప్పుడు ఆడతాయో, ఎందుకు ఊడతాయో తెలీకుండా పోతాయి. మిడిల్ క్లాస్ వర్గంలో ప్రథముడు అయిన హీరో సిద్ధార్థ్ తన సినిమాలు విడుదలకి దగ్గర పడ్డప్పుడల్లా ముందు చెప్పుకున్న స్టార్స్ కి భజన చేసే పనిలో బిజీ అవుతాడు.
జూ ఎన్టీఆర్ ని అతను ఏ రేంజ్ లో పొగుడుతాడనేది తెలిసిందే. ఇటీవల ఓ మై ఫ్రెండ్ సినిమాకీ మహేష్ బాబు దూకుడు"కీ లింకు పెట్టేసి మహేష్ ఫ్యాన్స్ దగ్గర మార్కులు కొట్టేయాలని చూశాడు. అఫకోర్స్ మహేష్ ఫ్యాన్స్ కి ఆవిషయం తెలిసిందే..
పంజా టీజర్ చూడగానే 'అన్ బిలీవబుల్" అంటూ పవర్ స్టార్ ని ఎత్తేశాడు. అంతే కాదు సిద్దార్ధ క్లోజ్ ఫ్రెండ్స్ 'పంజా' సినిమా కోసం పని చేసారంట. వాళ్ళ కోసం 'పంజా' టీజర్ చూసిన సిద్దార్ద, పవన కళ్యాణ్ లుక్ అదిరిపోయిందని, తన ఫ్రెండ్స్ ఈ సినిమా కోసం పనిచేసినందుకు హ్యాపీ అని అంటున్నాడు. ఈ ఎత్తులన్నీ అతనికి సదరు స్టార్ హీరోల అభిమానుల్లో సాప్ట్ కార్నర్ ఏర్పడేలా చేస్తున్నాయో లేదో కొన్నాళ్లాగితేనే తెలుస్తుంది.
ప్రస్తుతం సిద్దార్థ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం 'ఓ మై ఫ్రెండ్". శృతిహాసన్ , హన్సిక హీరోయిన్ లు. ఈ చిత్రం ద్వారా వేణుశ్రీరామ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది.


Click it and Unblock the Notifications











