శ్రీరెడ్డిపై శివబాలాజీ కేసు.. పవన్ కల్యాణ్ అభిమానిగా జీర్ణించుకోలేకపోతున్నా..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటుడు శివబాలాజీ తీవ్రంగా స్పందించారు. తాను అమితంగా ఆరాధించే పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి దారుణమైన వ్యాఖ్యలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోయాను అని అన్నారు. ఈ మేరకు నటుడు శివబాలాజీ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో సూచించారు.

పవన్ కల్యాణ్‌పై నీచంగా వ్యాఖ్యలు
నేను శివబాలాజీని. వృత్తిపరంగా నటుడిని. అంతేకాకుండా పవన్ కల్యాణ్ అభిమానిని. ఆయనతో నాకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏప్రిల్ 16వ తేదీన 5 గంటల ప్రాంతంలో నా ఇంట్లో టెలివిజన్ చూస్తుండగా, ఓ కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌పై దారుణంగా కామెంట్స్ చేసింది. నాలాంటి అభిమానిని తట్టుకోలేని విధంగా ప్రవర్తించింది.

రాజకీయ ప్రలోభంతోనే శ్రీరెడ్డి
పవన్ కల్యాణ్‌ను, ఆయన తల్లిని అత్యంత దారుణమైన, నీచమైన పదజాలంతో తిట్టింది. కొందరు రాజకీయ నేతల ప్రోద్బలంతోనే శ్రీరెడ్డి తిట్టిందని తెలుసుకొన్న నేను చాలా షాక్‌కు గురయ్యాను. జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కల్యాణ్‌ను, ఆయన ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టడానికే ఈ కుట్ర చేశారు.

పవన్‌కు మచ్చగా
శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు పవన్ రాజకీయ, వ్యక్తిగత జీవితానికి మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయనే భావన నాకు కలిగింది. ఆమె వ్యాఖ్యల నేపథ్యంలో నా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ విషయంలో శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోకుంటే ప్రజా సంక్షేమానికి దెబ్బగా మారే పరిస్థితి ఉంది.

పవన్ అభిమానిగా
శ్రీరెడ్డి వ్యాఖ్యల అనంతరం పవన్ కల్యాణ్ అభిమానిగా నేను ఆమెపై కేసు నమోదు చేయాలని భావించాను. ఆమె వాడిన నీచమైన పదజాలం మహిళల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నది.

ప్రజా జీవితానికి చేటు కలిగించే
శ్రీరెడ్డి వ్యాఖ్లయు ప్రజల శాంతికి చేటు కలిగే విధంగా ఉంది. కావున శ్రీరెడ్డిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని నేను పోలీస్ శాఖను కోరుకొంటున్నాను అని శివ బాలాజీ ఫిర్యాదులో పేర్కొన్ానరు.


Click it and Unblock the Notifications











