రాశిపై ఆయన చిందులకు కారణం...
మాజీ హీరోయిన్ రాశి సినిమాల్లో అవకాశాలు తగ్గి పోవడంతో వేరే ఇన్‌కం సోర్స్ వెతుక్కున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాశి చిన్న పిల్లలను ఆడించే ప్లే స్కూల్ రన్ చేస్తోంది. తాజాగా ఆమె స్కూలుపై నటుడు శివ బాలాజీ విమర్శలకు దిగారు. ఆయన విమర్శలకు దిగడానికి కారణం...శివ బాలాజీ 2 సంవత్సరాల కొడుకు రాశి ప్లే స్కూలు నుంచి తిరిగి వస్తూ ముఖంపై చిన్నపాటి గాట్లు పడ్డాయి.
ఇంటికి రాగానే తన కొడుకు ముఖంపై గాట్లు ఉండటం చూసిన శివబాలాజీ భార్య మధుమిత...వెంటనే రాశికి ఫోన్ చేసి చడమడా వాయించేసిందట. ఈ విషయం తన భర్త బాలాజీకి ఫోన్ చేసి చెప్పడంతో అతను కూడా రాశిపై కోపం చేసుకున్నట్లు తెలుస్తోంది. శివ బాలాజీ అంతటితో ఆగకుండా తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో రాశి నడుపుతున్న ప్లే స్కూల్ పై విమర్శలు చేశాడు.
దీనిపై రాశి స్పందిస్తూ...'స్కూల్లో ఉండగా ఈ సంఘటన జరుగలేదని, స్కూలు నుంచి ఇంటికి తిరిగి వెలుతుండగా బస్సులో ఈ ఘటన చోటు చేసుకుందని, మధుమిత తనకు ఫోన్ చేసి అమర్యాదగా మాట్లాడిందని, అసలు విషయం తెలుసుకోకుండా శివ బాలాజీ అలాంటి కామెంట్లు చేయడం సరికాదని' మండి పడ్డారు. తన స్కూల్లో 70 మంది పిల్లలు ఉన్నారని, ఇప్పటి వరకు ఎవరికీ ఇబ్బంది కలుగలేదు. తాను పర్ ఫెక్టుగా ప్లేస్కూల్ నడుపుతున్నానని, దీనిపై నేను ఎలాంటి డిబేట్ కైనా సిద్ధమే అని సవాల్ చేసింది.


Click it and Unblock the Notifications











