శివబాలాజీ భార్య వేధించిన వ్యక్తి అరెస్ట్?.. సినీ పరిశ్రమకు చెందిన వాడేనట..
తెలుగు బిగ్‌బాస్ విజేత, సినీ నటుడు శివ బాలాజీ భార్య మధుమితకు అసభ్య సందేశాలు పంపిన వ్యవహారంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పురోగతిని సాధించినట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారంలో నిందితుడిని పోలీసులు అర
తెలుగు బిగ్‌బాస్ విజేత, సినీ నటుడు శివ బాలాజీ భార్య మధుమితకు అసభ్య సందేశాలు పంపిన వ్యవహారంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పురోగతిని సాధించినట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారంలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. అయితే అధికారికంగా పోలీసులు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

కొద్దికాలంగా అసభ్య సందేశాలు
తన భార్య మధుమితకు గత కొద్దికాలంగా ఈ-మెయిల్‌లో అసభ్య సందేశాలు, ఫొటోలు పంపుతూ ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడుతున్నాడు. ప్రారంభంలో వాటిని పట్టించుకోకుండా మధుమిత వాటిని డిలీట్ చేస్తూ వచ్చారు.

శృతిమించడంతో శివబాలాజీ
కానీ అగంతకుడి ఆగడాలు శృతి మించడంతో శివ బాలాజీ తీవ్రంగా స్పందించారు. సదరు వ్యక్తి ఈ-మెయిల్ అడ్రస్‌ను పోలీసులకు అందించి అతడిపై ఆదివారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

నిందితుడి అరెస్ట్
శివబాలాజీ ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఐపీ అడ్రస్ ద్వారా నిందితుడి ఆచూకీని తెలుసుకొన్నాడు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. అయితే ఆ వ్యక్తి సినిమా పరిశ్రమకు చెందిన వాడేననే విషయం వెలుగులోకి రావడంతో సినీ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంలో పట్టుబడిన వ్యక్తే కాకుండా, మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొన్నట్టు సమాచారం. సదరు వ్యక్తి పేరుపై మొబైల్ నంబర్ ఉండటం, ఆ నంబర్ నుంచే అసభ్యకర మెసేజ్‌లు రావడంతో అతడిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ కేసుని చాలా సీరియస్‌గా తీసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు వర్గాలు త్వరలోనే నిందితుల వివరాలను బయటపెడతామని తెలిపినట్లుగా తాజా సమాచారం.

గోప్యంగా ఉంచడంపై
అయితే ఆ వ్యక్తి ఎవరు, అతని అరెస్ట్ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడంపై అనేక అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాటమరాయుడు సినిమా షూటింగ్ సందర్భంగా శివ బాలాజీని ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











