twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాబోయే టీటీడీ చైర్మన్ తానే అంటున్న హీరో!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి తనకే వస్తుందని ప్రకటించేసాడు తెలుగు హీరో శివాజీ. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఆయన మాత్రం నమ్మకంగా చెబుతున్నాడు. పదవి కోసం తాను పైరవీలు చేయనని, ఆ పదవే తనను వెతుక్కుంటూ వస్తుందని స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నాడు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే టీవీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. తనకు ఎంపీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ పోటీ చేసే ఉద్దేశ్యం లేదని, అలాంటి ఉద్దేశ్యమే ఉంటే గత ఎన్నికల్లోనే నరసారావు పేట నుండి పోటీ చేసే వాన్ని అని చెప్పుకొచ్చారు.

    అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీలోని హేమా హేమీలను పక్కకు తోసి శివాజీ టీటీడీ చైర్మన్ పదవి ఎలా దక్కించుకుంటారు? అనే విషయం చాలా మందికి అంతు చిక్కడం లేదు. మరి ఆయన ఈ పదవి ఎలా దక్కించుకుంటారు? అనే ప్రశ్నకు రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    Actor Sivaji about TTD Chairman post

    శివాజీ తెలుగు దేశం పార్టీకి చెందిన వ్యక్తి కాదు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ఆయన బిజేపీ పార్టీలో చేరి పార్టీ తరుపున ప్రచారం చేసారు. తెలుగు దేశం-బీజేపీ పొత్తు నేపథ్యంలో ఆయనకు ఈ పదవి దక్కే అవకాశాలను కొట్టి పారేయలేమని మరికొందరి వాదన.

    అయితే తెలుగు దేశం పార్టీ వర్గాలు మాత్రం శివాజీ వ్యాఖ్యలను లైట్ తీసుకుంటున్నాయి. ఆయన కేవలం సినిమా పరిశ్రమలో తన ఇమేజ్ పెంచుకోవడానికి, మీడియాలో పబ్లిసిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే వాదనను కొందరు తెరపైకి తెస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడే ఆ పదవి చదలవాడకు ఫిక్స్ చేసారు. ఆగస్టు నెలలోనే టీటీడీ పాత పాలక మండలి రద్దయినా ఇంకా కొత్త పాలక మండలి ఏర్పడ లేదు. మరి ఏం జరుగబోతోందో చూడాలి.

    English summary
    Actor Sivaji said that he could easily balance the political and cinema life and clarified that becoming the TTD Chairman will be taking place in the future.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X