‘ఎన్టీఆర్ ట్వీట్ ప్రభంజనం.. యావత్ తెలుగు ప్రజలకు చేరువగా’
లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందించిన చిత్రం దండోరా. తెలుగు సినిమా పరిశ్రమలోని పాపులర్ యాక్టర్లు శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. సామాజిక సృహ, కులం వివక్ష లాంటి అంశాలతో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు.
ఈ మూవీ సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫిని, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా, మార్క్ కే రాబిన్ మ్యూజిక్, క్రంతి ప్రియం ఆర్ట్ డైరెక్టర్‌గా, రేఖా బొగ్గారపు కాస్టూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఇప్పటికే మంచి అంచనాలు పెంచుకొన్న ఈ చిత్రం డిసెంబర్ 23న గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా థియేట్రికల్‌గా విజయవంతమవ్వడమే కాకుండా ఓటీటీలో విశేషమైన స్పందన లభించింది. అయితే ఈ సినిమా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డును గెలుచుకొన్నది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అభినందన సభను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ..

సామాజిక స్పృహ, కుల వివక్ష, అగ్ర కులాలు, తక్కువ కులాల మధ్య ఆధిపత్యం లాంటి అంశాలతో దండోరా సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో అద్బుతమైన ప్రతిభను చాటిన నటుడు శివాజీకి ఉత్తమ సహాయ నటుడు అవార్డును అందించారు. అంతేకాకుండా ఈ సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డు కూడా లభించడం విశేషంగా మారింది. అయితే ఈ సినిమాకు ఉత్తమ దర్శకుడి అవార్డు వస్తుందని ఆశించాను. కానీ ఎందుకో ఇవ్వలేదు. మరోసారి ఉత్తమ దర్శకుడి అవార్డు కోసం ప్రయత్నించండి. మీ రైటింగ్ బాగుంటుంది అని దర్శకుడు మురళీని అభినందించారు.
ఈ సినిమా ఆశించినంతగా థియేట్రికల్‌గా విజయం అందించలేదనేది నా ఫీలింగ్. అయితే మనం ఆశించింది ఏదో జరుగలేదంటే.. అంతకంటే ఏదో పెద్దది జరుగుతుందని అనుకొంటాను. ఈ సినిమాకు అవార్డు రూపంలో గొప్ప అరుదైన గౌరవం లభించింది. ఈ సినిమాకు ఉత్తమ దర్శకుడి అవార్డు వస్తుందని ఆశించాను అని శివాజీ అన్నారు.
సాధారణంగా శంఖువులో పోస్టే తీర్థం అవుతుందని అంటారు. గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్ వేసిన ట్వీట్ ఓ ప్రభంజనం సృష్టించింది. ఆ ట్వీట్ ద్వారా ఈ సినిమా ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఈ సినిమాను యావత్ తెలుగు జాతి వద్దకు తీసుకెళ్లిన ఎన్టీఆర్‌కు ధన్యవాదాలు అని శివాజీ అన్నారు.
ఇదిలా ఉండగా, దండోరా సినిమా ఓటీటీలో వీక్షించిన ఎన్టీఆర్ ఓ ట్వీట్ చేశారు. సమాజంలోని పరిస్థితులను ఆలోచింపజేసే పవర్‌ఫుల్ చిత్రం. నవదీప్, నందూ, రవికృష్ణ, బిందు మాధవి అద్బుతమైన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. గ్రామీణ పరిస్థితులు, సామాజిక అంశాలు, ప్రజల జీవన విధాన మూలాల ఆకళింపు చేసుకొని కథను, పాత్రలను బలంగా రాసుకొన్నారు. కథను అద్బుతంగా తెర మీద ఆవిష్కరించిన దర్శకుడు మురళీ కాంత్‌కు హ్యాట్సాఫ్. ఇలాంటి బలమైన కథ నమ్మి... అండదండలు అందించిన నిర్మాత రవీంద్ర బెనర్జీకి అభినందనలు. ఓ గొప్ప చిత్రంలో భాగమైన చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బందికి కంగ్రాట్యులేషన్ అని జూనియర్ ఎన్టీఆర్ తన అభినందన సందేశాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేయగా వైరల్ అయింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











