కోర్టు మెట్లెక్కిన హీరో శివాజీ.. క్వాష్ పిటిషన్‌పై రియాక్షన్
టీవీ 9 వివాదం విషయమై చివరకు తెలంగాణ హైకోర్టును సంప్రదించారు హీరో శివాజీ. ఇటీవలే 'టీవీ 9' కొత్త యాజమాన్యం అలంద మీడియా సంస్థ రవిప్రకాష్ పై ఓ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. ఈ కేసుతో నటుడు శివాజీకి కూడా సంబంధం ఉందని తేలింది. దీంతో తమ ముందు హాజరుకావాలని రవి ప్రకాష్ తో పాటు శివాజీకి కూడా నోటీసులు జారీ చేశారు పోలీసు శాఖ.
అప్పటి నుంచి హీరో శివాజీ ఎక్కడా కనిపించలేదు. ఈ కేసు విచారణ నిమిత్తమై రవి ప్రకాష్ విచారణకు హాజరైనప్పటికీ శివాజీ మాత్రం హాజరు కాలేదు. పైగా ఈ విషయమై నటుడు శివాజీ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై సైబర్ క్రైమ్ పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని, ఆ కేసును వెంటనే కొట్టేయాలని ఆ పిటిషన్ ద్వారా హైకోర్టును కోరారు హీరో శివాజీ. తనను పోలీసులు ముందస్తు అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాలని కోరుతూ కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు శివాజీ.

కాగా మరోవైపు ఇప్పటి వరకు శివాజీకి మూడు సార్లు నోటీసులు జారీ చేసినా పోలీసు విచారణకు హాజరు కాలేదని ప్రభుత్వం హైకోర్టుకి తెలిపింది. దీంతో శివాజీ వేసిన ఈ పిటిషన్, ప్రభుత్వ వినతిపై విచారణ జరిపిన హైకోర్టు చివరకు ఓ నిర్ణయానికి వచ్చింది. ఇరుపక్షాల వాదనలు కూలంకషంగా పరిశీలించిన న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను జూన్ 26 వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.


Click it and Unblock the Notifications











