రాజకీయాల్లోకి వస్తున్నా, హీరోయిన్ల మేనేజర్లే కారణం, రామానాయుడు గారు...: శివాజి రాజా

తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా తెలిపాడు. గత 20 ఏళ్లుగా తాను బీజేపీలో ఉన్నానని, ప్రతి ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నానని అన్నాడు.

తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా తెలిపాడు. గత 20 ఏళ్లుగా తాను బీజేపీలో ఉన్నానని, ప్రతి ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నానని అన్నాడు. కృష్ణంరాజుగారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే తాను బీజేపీలో చేరానని, రామానాయుడుకు కూడా ప్రచారం చేశానని చెప్పాడు. ఏపీలో పుట్టినా కేవలం 15 ఏళ్లు మాత్రమే అక్కడ ఉన్నాడట, తరువాత జీవితమంతా తెలంగాణలోనేనని అన్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఇష్టమే అయినా ఆయనపై అభిమానంతో ఆ పార్టీవైపు చూసే ప్రసక్తి లేదని చెప్పాడు.

ఇప్పటికైతే ఆఫర్ ఉంది

ఇప్పటికైతే ఆఫర్ ఉంది

బీజేపీ తరపునే పోటీ చేయాలని ఉందని అన్నాడు. ఇప్పటికైతే ఆఫర్ ఉందని చెప్పాడు. పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తానని అన్నాడు. నిజాయతీగా, ముక్కుసూటిగా, మంచితనంగా ఉండడం పరికిరాదని తన స్నేహితులంతా చెబుతుంటారని, అయితే ఆ లక్షణాలే తనను మా అధ్యక్షుడిని చేశాయని, అవే లక్షణాలతో తాను రాజకీయాల్లోకి వస్తానని శివాజీ రాజా తెలిపాడు.

Recommended Video

Raviteja and Raja Ravindra Disputes Revealed - Filmibeat Telugu
హీరోయిన్ల డేట్లు చూసే మేనేజర్లు

హీరోయిన్ల డేట్లు చూసే మేనేజర్లు

ఇక ఆ తర్వాత చాలా విషయాలనే చెప్పాడు లెండి.. డేట్లు చూసే మేనేజర్లు హీరోయిన్ల అవకాశాలు పాడు చేస్తున్నారని అన్నాడు. అందరూ కాకపోయినా 30 శాతం మంది మేనేజర్లు అలాగే ఉన్నారని చెప్పాడు. వారి వల్ల హీరోయిన్లకు వచ్చే అవకాశాలు రాకుండాపోతున్నాయని చెప్పాడు.

వారిని మొత్తం కట్ చేస్తే కానీ

వారిని మొత్తం కట్ చేస్తే కానీ

సినీ పరిశ్రమలో దళారుల ప్రమేయం వల్ల చాలా సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నాడు. వారిని మొత్తం కట్ చేస్తే కానీ పరిస్థితులు చక్కబడవని తెలిపాడు. వారిని కట్ చేసేంతవరకు తెలుగు చిత్రపరిశ్రమకు మంచిమంచి హీరోయిన్ల కొరత వెంటాడుతూనే ఉంటుందని అన్నాడు. వారిలో వారు కుమ్మక్కై హీరోయిన్లను ఖాళీగా ఉంచుతున్నారని, ఇంకొందరు కుమ్మక్కై కొంతమందికి అవకాశాలు కల్పిస్తుంటే, మరికొందరి అవకాశాలను పాడుచేస్తున్నారని చెప్పాడు.

తన చేతుల్లోనే కుప్పకూలి

తన చేతుల్లోనే కుప్పకూలి

హైదరాబాదులోని మా కార్యాలయంలో రిక్రియేషన్ కార్యాలయంతో పాటు ఒక జిమ్, ఒక ఆసుపత్రి నిర్మించడం తన ఆశయమని శివాజీ రాజా చెప్పాడు. మొన్నామధ్య రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా తమకు భోజనం పెట్టే వ్యక్తి తన చేతుల్లోనే కుప్పకూలి కోమాలోకి వెళ్లిపోయాడని గుర్తు చేసుకున్నాడు.

అందరికీ న్యాయం జరగాలి

అందరికీ న్యాయం జరగాలి

అతనిని కామినేని ఆసుపత్రికి తరలించానని, అలాంటి వారందరికీ న్యాయం జరగాల్సిన అవసరం ఉందని చెప్పాడు. మా ఆధ్వర్యంలో నిర్మించే ఆసుపత్రిలో చిత్రపరిశ్రమలోని అన్ని క్రాఫ్టులకు చెందినవారు ఆనందంగా వైద్య సదుపాయాలు అందుకోవాలని ఆకాంక్షించిన ఆయన. అందుకోసం తాను వందశాతం ప్రయత్నిస్తానని అన్నాడు. అయితే పూర్తి చేయగలనో లేదోనని సందేహం వ్యక్తం చేశాడు.

రామానాయుడు

రామానాయుడు

గతంలో సినీ పరిశ్రమలో ఏవైనా సమస్యలు ఏర్పడితే పరిశ్రమలో ఒక పెద్దగా రామానాయుడు మాటసహాయం చేసేవారని అన్నాడు. అయితే దాసరి నారాయణరావు అలా కాదని, ఆయన ప్రతి సమస్యకు పరిష్కారం వెతికే వారని అన్నారు. ఆయన దగ్గరకు ఏ సమస్య వెళ్లినా దానిని పరిష్కరించేంత వరకు విశ్రమించేవారుకాదని అన్నారు.

ఆయన మహానుభావుడు

ఆయన మహానుభావుడు

సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ ఆయన వద్దకే వెళ్లేవారని ఆయన చెప్పారు. సినీ కుటుంబపెద్దగా ఆయన రెండు వర్గాలను వెనకేసుకొచ్చేవారని, రెండు వర్గాలకు న్యాయం చేసేవారని ఆయన తెలిపారు. ఆయన మహానుభావుడని, ఆయన తరువాత సినీ పరిశ్రమలో ఆ స్థానంలో ఎవరూ లేరని ఆయన చెప్పారు. తాను మా అధ్యక్షుడయ్యేందుకు కూడా ఆయన సహాయం చేశారని శివాజీ రాజా తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X