twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైసిపిలో చేరిన శివాజీ రాజా.. మెగా బ్రదర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇదేనా!

    |

    Recommended Video

    Actor Sivaji Raja Joins YSRCP || Filmibeat Telugu

    మార్చి 10న మా అసోసియేషన్ ఎన్నిక ముగిసింది. నరేష్ ప్యానల్ విజయం సాధించింది. త్వరలో నరేష్ మా అసోసియేషన్ అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించబోతున్నారు. వివాదం ఇక ముగిసింది అనుకుంటున్న తరుణంలో నరేష్, శివాజీ రాజా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మా అసోసియేషన్ ఎన్నికల్లో మెగా బ్రదర్ నాగబాబు నరేష్ ప్యానల్ కు మద్దత్తు తెలిపిన సంగతి తెలిసిందే. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన శివాజీ రాజా తాజాగా రాజకీయ పరమైన సంచలన నిర్ణయం తీసుకున్నారు.

    వైసిపిలో చేరిన శివాజీ రాజా

    వైసిపిలో చేరిన శివాజీ రాజా

    వైసిపిలో సినీతారల సందడి ఎక్కువవుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కమెడియన్ పృథ్విరాజ్, అలీ వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల ముగిసిన మా అసోసియేషన్ ఎన్నికల్లో పరాజయం చెందిన శివాజీ రాజా గురువారం వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల కోసం ఆయన వైసిపి తరుపున ప్రచారం నిర్వహిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి.

    రిటర్న్ గిఫ్ట్ ఇదేనా

    రిటర్న్ గిఫ్ట్ ఇదేనా

    కొద్దిరోజుల క్రితం నరేష్ కు కౌంటర్ ఇచ్చేందుకు మీడియా సమావేశం నిర్వహించిన శివాజీ రాజా నాగబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగబాబు నాకు 30 ఏళ్ల నుంచి స్నేహితుడు. మా అసోసియేషన్ ఎన్నికల్లో నాకు ఆయన గిఫ్ట్ ఇచ్చారు. నేను తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ శివాజీ రాజా వ్యాఖ్యానించాడు. తాజాగా శివాజీ రాజా వైసిపిలో చేరడంతో నాగబాబుకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అనే చర్చ జరుగుతోంది.

    నరసాపురంలో ప్రచారం

    నరసాపురంలో ప్రచారం

    నాగబాబు బుధవారం రోజు జనసేన పార్టీలో చేరారు. చేరడమే కాదు జనసేన అధినేత పవన్ తన సోదరుడికి నరసాపురం ఎంపీ టికెట్ కూడా కేటాయించారు. నాగబాబు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న నేపథ్యంలో అదే నియోజకవర్గంలో శివాజీ రాజా వైసిపి తరుపున ప్రచారం నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా శివాజీ రాజా తీసుకున్న రాజకీయ నిర్ణయం మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

    ఆ విషయంలో అసంతృప్తి

    ఆ విషయంలో అసంతృప్తి

    మా అసోసియేషన్ ఎన్నికకు కొద్దిరోజుల ముందు నాగబాబు నరేష్ ప్యానల్‌కు మద్దతు ప్రకటించారు. శివాజీ రాజా తనకు సన్నిహితుడు అయినప్పటికీ కొన్ని అంశాలలో అతడు విఫలం అయ్యాడని నాగబాబు అన్నారు. మా అసోసియేషన్ ప్రతిష్ట దిగజార్చేలా కొన్ని సంఘటనలు జరుగుతుంటే శివాజీ రాజా ధీటుగా మాట్లాడలేక పోయారని నాగబాబు అన్నారు. ఆ సమయంలో జీవిత ఒంటరిగా చాలా గట్టిగా మాట్లాడింది అని నాగబాబు ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఈ అంశమే శివాజీ రాజా, నాగబాబు మధ్య వివాదానికి కారణం అంటూ వార్తలు వస్తున్నాయి.

    English summary
    Actor Sivaji Raja joins YSRCP and he will participate in election campaigning
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X