సిద్ధిపేటలో ఫిల్మ్ స్టూడియో, గజ్వేల్‌లో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్... ఇండస్ట్రీ నుంచి ప్రపోజల్!

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. చిత్ర పరిశ్రమలో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? అంటే అవును అని అంటున్నారు ప్రముఖ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 88 సీట్లు రావడం చాలా గొప్ప విషయమని, దీని వల్ల మరిన్ని మంచి పనులు చేసే అవకాశం వారికి దక్కింది అన్నారు.

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, తలసాని లాంటి వారు మాట ఇస్తే తప్పకుండా చేస్తారు. సినీ పరిశ్రమకు తలసాని లాంటివారు ఉండటం, ఎఫ్‌డిసి చైర్మన్ రామ్మోహన్ రావు లాంటివారు ఉండటం ప్లస్ పాయింట్. వారికి సినిమాతో అనుబంధం ఉంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ కూడా సినిమా పరిశ్రమతో సంబంధం ఉన్నవారే. దీని వల్ల మేము ప్రభుత్వ పెద్దలతో కలవడం చాలా ఈజీ. సినిమా కాకుండా బయటివారికి ఈ మంత్రిత్వ శాఖ ఇస్తే మాకు కొంచెం కష్టమని శివాజీ రాజా అన్నారు.

 సిద్ధపేటలో ఫిల్మ్ స్టూడియో ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుంది

సిద్ధపేటలో ఫిల్మ్ స్టూడియో ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుంది

నేను ఈ మధ్య కాలంలో ఐదారు సార్లు తెలంగాణలోని సిద్ధపేట వెళ్లి వచ్చాను. సిద్ధిపేట చూసిన తర్వాత చాలా గొప్పగా అనిపించింది. అక్కడ మినీ స్టూడియో లాంటిది ఏమైనా కడితే తెలుగు ఇండస్ట్రీకి చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. హైదరాబాద్ నుంచి రెండు గంటల్లో అక్కడికి వెళ్లొచ్చు. సిద్ధపేటలో ఉన్న గొప్పదనం... పల్లెటూరి వాతావరణం, పట్నం వాతావరణం ఉంటుంది. అక్కడి ప్రజలు చాలా మంచి వారు. షూటింగ్ జరుగుతుంటే ఎలాంటి డిస్ట్రబెన్స్ చేయలేదని శివాజీ రాజా అన్నారు.

 స్టూడియోలు దొరకడం లేదు

స్టూడియోలు దొరకడం లేదు

హరీష్ రావుగారు అక్కడ ఇన్ని పనులు చేశారు కదా... ఈ ఏరియాలో స్టూడియోలాంటిది ఏమైనా కడితే చాలా బావుంటుంది. టీవీ రంగం పెరిగిపోవడం వల్ల ఏ స్టూడియో దొరకడం లేదు. ఔట్ డోర్ వెళ్లాలన్నా సిటీ కూడా పెరిగిపోయింది. పచ్చని పొలాలు దొరకాలంటే కొంచెం కష్టంగా ఉంది. సిద్ధిపేట సినిమా ఇండస్ట్రీకి కంఫర్టుగా ఉంటుందని అనుకుంటున్నాను.

 గజ్వేల్‌లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్, త్వరలో ప్రపోజల్

గజ్వేల్‌లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్, త్వరలో ప్రపోజల్

త్వరలోనే ఈ విషయమై ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టాలనుకుంటున్నాం. కేటీఆర్ గారిని మా కమిటీ అంతా కలిసేందుకు వెళుతున్నాం. ఫిల్మ్ ఇనిస్ట్యూట్ కూడా గజ్వేల్ కానీ... సిటీకి ఒక గంట ప్రయాణం దూరంలో పెడితే బావుంటుందన్నారు.

గోల్డేజ్ హోజ్ కట్టాలనే ఆలోచన ఉంది

గోల్డేజ్ హోజ్ కట్టాలనే ఆలోచన ఉంది

త్వరలో ఇండస్ట్రీ మొత్తం కలిసి కొత్త ప్రభుత్వాన్ని అభినందించడానికి వెళుతున్నాం. అందులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఉంటుంది. దీంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన వారి కోసం గోల్డేజ్ హోమ్ కట్టాలనే ఆలోచన ఉంది. పరిశ్రమలో చాలా మంది ఆర్థికంగా లేని వారు ఉంటారు. వారికి ఇది ఆసరాగా ఉంటుంది. ఇదీ నా డ్రీమ్ ప్రాజెక్ట్. సీఎం గారు ఎక్కడైనా పదెకరాల స్థలం ఇస్తే కట్టాలని చూస్తున్నాం. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ మిగతా అందరు హీరోల సహాయంతో నిధులు సమీకరిస్తాం. ఇప్పటి వరకు వచ్చినవి ఫిక్డ్ డిపాజిట్ చేసి పెట్టాం. సైట్ దొరికిన వెంటనే పని మొదలు పెడతామని శివాజీ రాజా తెలిపారు..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X