twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో ప్రాణం నిలబెట్టిన సోనూ సూద్.. చిన్నారికి ఆపరేషన్ సక్సెస్!

    |

    కరోనా వైరస్, లాక్‌డౌన్ సమయంలో సోనూసూద్ చేసిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ సమయంలో ఎందరికో ఆర్థిక సాయం చేసిన ఆయన.. దేశంలోని వేలాది మందిని కష్టాల నుంచి గట్టెక్కించారు. వలస కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి, విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు స్వదేశం రావడానికి సైతం ఆయన సాయం చేశారు. తాజాగా సోనూ సూద్ కరీంనగర్‌కు చెందిన ఏడు నెలల మహ్మద్ సఫాన్ అలీకి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడంలో సహాయం చేశారు.

    కేరళలోని కొచ్చిలోని ఆస్టర్ మెడ్‌సిటీ ఆసుపత్రిలో చికిత్స జరిగింది. బాలీవుడ్ స్టార్ సోనూ సూద్‌తో కలిసి ఆస్టర్ వాలంటీర్లు ప్రారంభించిన సెకండ్ ఛాన్స్ ఇనిషియేటివ్ ద్వారా చికిత్స పొందిన మొదటి రోగిగా సఫాన్ అలీ నిలిచారు. సఫాన్ అలీకి నాలుగు నెలల వయస్సు ఉన్నప్పుడు కొచ్చిలోని ఆస్టర్‌కు తీసుకు వెళ్లారు.

    Actor Sonu Sood helps 7 month-old from Karimnagar with liver transplant surgery

    వైద్య పరిభాషలో చెప్పాలంటే బిలియరీ అట్రేసియా అనే అరుదైన వ్యాధితో సఫాన్ అలీ బాధపడుతున్నాడు. ఈ వ్యాధి తర్వాత కాలేయ వైఫల్యానికి దారి తీసింది. తెలంగాణలోని తన స్వస్థలమైన కరీంనగర్‌లో శస్త్రచికిత్స చేసి విఫలమైన తరువాత, సఫాన్ అలీకి తీవ్రమైన కామెర్లు వచ్చాయి. ఆ తరువాత సిర్రోసిస్‌ కూడా ఆయనకు ఎటాక్ అయింది.

    దానికి కాలేయ మార్పిడి అవసరం అని తేల్చారు. సోనూ సూద్ సహాయంతో సఫాన్ అలీ కొచ్చిలోని ఆస్టర్ మెడ్‌సిటీకి చేరుకుని విజయవంతంగా కాలేయ మార్పిడి ప్రక్రియ చేయించుకున్నారు.ఈ సంధర్భంగా వైద్య సంరక్షణ పురోగతిలో భారతదేశం భారీ ప్రగతిని సాధించింది, అయితే సఫాన్ అలీ మరియు అతని కుటుంబీకుల వంటి రోగులకు ఇంకా మైళ్ల దూరంలోనే ఉందని సోనూ సూద్ అన్నారు. చాలా ఎక్కువ ఖర్చు అవుతున్న కారణంగా సెకండ్ ఛాన్స్ చొరవతో ఈ ఆపరేషన్ చేయించమని అన్నారు. సఫాన్ అలీ లాంటి మరింత మంది రోగులకు జీవితాన్ని అందించండి అని బాలీవుడ్ నటుడు సోనూసూద్ అన్నారు.

    English summary
    Actor Sonu Sood helps 7 month-old from Karimnagar with liver transplant surgery which was become sucessfull.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X