Srikanth: ఊహతో హీరో శ్రీకాంత్ విడాకులు?.. ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన నటుడు
సినిమా ఇండస్ట్రీలో ప్రేమాయణాలు, బ్రేకప్ లు, పెళ్లిల్లు, విడాకులు సర్వసాధారణమే. ఇక రూమర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పుకార్లకు ప్రతి ఒక్క సెలబ్రిటీ బాధపడాల్సి వస్తోంది. ఎలా వస్తాయో తెలియదు గానీ, ఎక్కువగా వివాహబంధంతో అన్యూన్యంగా ఉన్న దంపతులు విడాకులు తీసుకోనున్నారని అకస్మాత్తుగా వార్తలు వస్తాయి. ఇక అవి నిజమో కాదో నిరూపించుకోవాల్సిన భారం ఆ సెలబ్రిటీ జంటలపై పడుతుంది. తాజాగా ఇలాగే ఈ పరిస్థితి టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ కు ఎదురైంది. శ్రీకాంత్-ఊహ త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలపై తాజాగా ఆయన స్పందించారు.

వారి విడాకులు ఉదాహరణగా..
చిత్రపరిశ్రమలోనిసెలబ్రిటీలకు కెరీర్ పరంగానే కాకుండా పర్సనల్ లైఫ్ కు సంబంధించి విచిత్రమైన సంఘటనలు ఎదురవుతుంటాయి. అందులో ఎక్కువగా రూమర్స్ ప్రముఖ పాత్ర వహిస్తాయి. అయితే సినీ రంగంలో సెలబ్రిటీలు ఎవరు ఎప్పుడు ప్రేమలో పడతారో.. ఎలాంటి జంట విడాకులు తీసుకుంటుందో ఊహించలేం. ఇందుకు ఇటీవల స్టార్ హీరోలు తీసుకున్న విడాకుల విషయం ఉదహారణగా చెప్పవచ్చు.

షాకింగ్ గా రూమర్స్..
సెలబ్రిటీ జంటలు అకస్మాత్తుగా డివోర్స్ తీసుకుని ఎలాంటి షాక్ ఇస్తారో అలాగే రూమర్స్ కూడా షాకింగ్ గా ఉంటాయి. ప్రతి సెలబ్రిటీ వెంట ఓ రూమర్ వెంట పడుతూనే ఉంటుంది. అయితే అందులో కొన్ని నిజం కావచ్చు. కానీ ఎక్కువగా రూమర్స్ గానే మిగిలిపోతున్నాయి. ఇక తమపై వచ్చిన వార్తలు నిజం కాదు.. రూమర్స్ అని సెలబ్రిటీలు వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇలాంటి పరిస్థితినే నటుడు శ్రీకాంత్ ఎదుర్కొన్నారు.

నేను చనిపోయినట్లు రాశారు..
గత రెండు మూడు రోజులుగా శ్రీకాంత్-ఊహ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. శ్రీకాంత్-ఊహా విడాకులు తీసుకుంటున్నట్లు కొన్ని వెబ్ సైట్స్, యూట్యూబ ఛానెల్స్ లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వడం పట్ల సీనియర్ హీరో శ్రీకాంత్ తీవ్రంగా స్పందించాడు. "ఇలాంటి నిరాధారమైన, పనికిమాలిన వార్తలను ఎవరు పుట్టిస్తున్నారు. గతంలో నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారు" అని శ్రీకాంత్ తెలిపాడు.

కొన్ని చిల్లర వెబ్ సైట్స్ చేసిన పని..
"ఇప్పుడు తాజాగా మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కొన్ని వెబ్ సైట్స్ లో వచ్చిన ఈ ఫేక్ న్యూస్ ను తన ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయడంతో తను కంగారుపడుతూ ఆ పోస్ట్ లను నాకు చూపించింది. ఇలాంటివి ఏమాత్రం నమ్మద్దు. ఆందోళన పడొద్దు అని ఆమెను ఓదార్చాను. అయితే ఏవో కొన్ని చిల్లర వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానెల్స్ వాళ్లు చేసిన ఈ పని సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది" అని శ్రీకాంత్ వెల్లడించారు.

ఇలాంటి సమయంలో ఈ వార్..
నటుడు శ్రీకాంత్ కొనసాగిస్తూ సోషల్ మీడియాలో మా విడాకుల వార్త స్ప్రెడ్ కావడంతో.. బంధుమిత్రులందరూ ఫోన్ చేసి అడుగుతుంటే వివరణ ఇచ్చుకోవడం పెద్ద న్యూసెన్స్ గా అనిపిస్తోంది. ప్రస్తుతం నేను ఊహ నిన్న చెన్నై వచ్చి ఇక్కడ నుంచి దైవ దర్శనానికి అరుణాచలం వెళ్తున్నాం. ఇలాంటి తరుణంలో ఈ పుకారు మా కుటుంబానికి చాలా చిరాకు తెప్పిస్తుంది. ఇది ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాను అని చెప్పారు.

కఠిన చర్యలు తీసుకోవాలి..
"నా మీదనే కాకుండా చాలా మంది ప్రముఖులపై ఇలాంటి నిరాధారమైన పుకార్లు స్ప్రెడ్ చేస్తున్న వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానెల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను" అని తమ విడాకుల వార్తలను తీవ్ర స్థాయిలో ఖండించారు హీరో శ్రీకాంత్. ఇదిలా ఉంటే హీరో శ్రీకాంత్, ఊహ ప్రేమించి వివాహం చేసుకున్నారు. 1994లో ఆమె సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయిన ఊహను 1997లో శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications











