Srikanth Iyengar: త్వరలో క్షమాపణలు చెబుతా.. దిగొచ్చిన శ్రీకాంత్ అయ్యంగార్
Srikanth Iyengar: వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల నటించిన లేటెస్ట్ తెలుగు థ్రిల్లర్ మూవీ పొట్టేల్. ఈ మూవీ అక్టోబర్ 25న విడుదలైన మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ మూవీ సక్సెస్ మీట్ లో ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) రివ్యూ రైటర్ల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిపై అసభ్య పదజాలం వాడుతూ.. అసలు సినిమా ఏంటో తెలియని వాడు రివ్యూ రాసేస్తాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అసలేం జరిగిందో తెలియదు కానీ, తాజాగా శ్రీకాంత్ అయ్యంగార్ ఓ వీడియోను నెట్టింట్లో పోస్ట్ చేశారు. ఇంతకీ ఏమన్నారో ఓ లూక్కేయండి.
యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల (Ananya Nagalla) లీడ్ రోల్స్‌లో సాహిత్ మోత్కురి తెరకెక్కించిన చిత్రం పోట్టెల్ (Pottel). ఈ మూవీ ఏ ముహుర్తాన ప్రారంభించారో తెలియదు కానీ వివాదాలు చుట్టుముడుతున్నాయి. గత వారం రోజుల క్రితం పోట్టెల్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ అనన్య నాగళ్లను ఓ లేడీ జర్నలిస్ట్ క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నించారు. హీరోయిన్ కి సినిమాల్లో అవకాశం ఇచ్చే ముందు కమిట్మెంట్ (commitment) అడుగుతారంట నిజమేనా? మీరు ఎప్పుడైనా అలాంటి అనుభవం ఎదుర్కొన్నారా ? అని ప్రశ్నించింది.

ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకోవాలని చూసినా, సదరు లేడీ జర్నలిస్ట్ ఏమాత్రం వదలకపోవడంతో అనన్య ఇబ్బంది పడింది. ఇలాంటివి ఇండస్ట్రీలో లేవు.. తాను అలాంటి ఎదుర్కోలేదన్నా వినిపించుకోలేదు. అనన్య తన కెరీర్‌లో తాను సంపాదించుకున్న పరువు మొత్తం పోయిందన్నట్లుగా వ్యవహరించింది. ఈ వివాదంలో ఆ లేడీ జర్నలిస్ట్ ను కామెంట్స్ చేస్తూ.. నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ విషయం తెలుగు ఫిలిం ఛాంబర్ వరకు వెళ్లడంతో సీరియస్ అయ్యింది.
ఈ సమస్య సద్దుమణగే లోపే.. ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) సంచలన వ్యాఖ్యలు చేశారు. పోట్టెల్ సక్సెస్ మీట్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. తాను ముక్కుసూటిగా మాట్లాడతానని అన్నారు. దరిద్రానికి వీరేచనాలు వస్తే రివ్యూ రైటర్లు పుడతారట, క్రిముల దొడ్డి నాకేటోళ్లు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారిని అందరం కలిసి ఆపేయాలని , జీవితంలో షార్ట్ ఫిల్మ్ తీయడం రాని వాళ్లు వచ్చి నోటికొచ్చినట్లు రాస్తున్నారంటూ పరుష పదజాలంతో దూషించారు. మాకు ప్రేక్షకులున్నారు. ఆ ప్రేక్షకుల మహా దేవుళ్లే.. సినిమాను ముందుకు తీసుకెళ్తారు. మీ రివ్యూలు మాకేం అక్కర్లేదని శ్రీకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
— Shrikanth BHARAT (@Shri__Bharat) October 27, 2024
ఒక్కోక్క సినిమా కోసం తాను ప్రతి క్షణం శ్రమించి, ప్రాణాలు పణంగా పెట్టి సినిమాలు తీస్తూనే ఉంటామని .. ప్రేక్షకులు ఆదరిస్తారని.. మీలాంటి వాళ్లు వస్తూ పోతూ ఉంటారంటూ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీకాంత్ అయ్యంగార్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫిల్మ్ జర్నలిస్టులు, క్రిటిక్స్ మండిపడ్డారు. శ్రీకాంత్ అయ్యంగార్ మాటలు జర్నలిస్టుల మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయి. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ మా అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) కు ఫిర్యాదు చేసిందట.
ఈ క్రమంలో సినిమా రివ్యూర్స్ పై తాను చేసిన వ్యాఖ్యలపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) స్పందించారు. త్వరలోనే క్షమాపణలు చెబుతానని వీడియో విడుదల చేశారు. పొట్టేల్ సినిమా సక్సెస్ మీట్‌లో తాను మాట్లాడిన కొన్ని మాటలు కొంత మందికి బాధ కలిగించాను. త్వరలో అందరికీ కరెక్ట్ విషయాలపై బేషరతు క్షమాపణలు చెబుతాను. దయచేసి వేచి ఉండండి'' అని వీడియోలో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











