53 ఏళ్ల వయసులో రెండో పెళ్లి కోసం RGV నటుడి ఆరాటం... ఈ కక్కుర్తి ఏంటయ్యా?

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం సినిమాల్లో దూసుకుపోతున్న శ్రీకాంత్ అయ్యంగార్ తెలుగువారికి సుపరిచితమే. ఈయన పేరు చెబితే గుర్తు పట్టకపోయినప్పటికీ ఫేస్ చూస్తే వెంటనే గుర్తుపట్టేస్తారు. ఇక ఆర్జీవీ సినిమాల్లో కనిపించే ఈ నటుడు.. రెండో పెళ్లి కోసం తెగ ఆరాట పడుతున్నాడు. అంతేనా పెళ్లైయి పిల్లలు ఉన్నప్పటికీ... 53 ఏళ్లలో రెండో పెళ్లేంటి అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

శ్రీకాంత్ అయ్యంగార్... తెలుగు సినిమాల్లో కనిపిస్తూంటారు. ఇక ఆయన ఎక్కువగా ఆర్జీవీ సినిమాల్లో కీలకపాత్రల్లో నటింస్తుంటారు. ఇక శ్రీకాంత్ అయ్యంగార్ కు ఇప్పటికే పెళ్లై పిల్లలు సైతం ఉన్నారు. ఇక ఇతనికి 53 ఏళ్లు. ఈ వయసులో రెండో పెళ్లికి రెడీ అంటూ గత కొంత కాలంగా తన సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ వస్తున్నారు.

Srikanth Iyengar

ఇటీవల శ్రీకాంత్ అయ్యంగార్ రెండో పెళ్లికి రెడీగా ఉన్నట్లు ఒక పోస్ట్ చేశారు. ఆ అమ్మాయి ప్రేమలో పడ్డానని ఆయన పెట్టిన పోస్ట్ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీకాంత్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక అమ్మాయి ఫోటో పెట్టి ఒక క్యాప్షన్ కూడా పెట్టి డిలీట్ చేశారు

ఇక అందులో ఏముందంటే.. శ్రీకాంత్ అయ్యంగార్ పబ్ లో ఒక ఫోటోగ్రాఫర్ ని కలిశారట. ఇక ఆ ఫోటోగ్రాఫర్ ని కలసి ఒక ఫోటో కూడా దిగి ఆ ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి "మై లవ్.. ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత కాసేపట్టికి ఆ పోస్ట్ డిలీట్ చేశారు.

Srikanth Iyengar

ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఆ పోస్ట్ పెట్టి.. ఆ అమ్మాయి తిట్టడంతో ఆ పోస్ట్ డిలీట్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ శ్రీకాంత్ అయ్యంగార్ ఓ అమ్మాయి ఫోటో పెట్టి... మళ్లీ పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు. ఆమె తనను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.

మరి ఈసారి నిజంగా పెట్టాడా.. లేదా ఆ అమ్మాయికి తెలియకుండా పెట్టాడా అనేది తెలియదు. ఇక శ్రీకాంత్ అయ్యంగార్ కు పెళ్లి మీద మస్తు ఆరాటం ఉందని అంటున్నారు నెటిజన్స్. మరి ఈ అమ్మాయి ఒప్పుకుంటే నిజంగానే శ్రీకాంత్ అయ్యంగార్ రెండో పెళ్లి చేసుకుంటారేమో లేదో చూడాలి.

Srikanth Iyengar

ఇక శ్రీకాంత్ అయ్యంగార్ సినిమాల విషయానికి వస్తే... బెదురులంక, సామజవరగమన వంటి సినిమాల్లో ఇటీవల నటించారు. బుజ్జి ఇలా రా,అజ్ఞాతవాసి,అంటే సుందరానికి, పండగ చేసుకో, ఎఫ్3, టక్ జగదీష్, నాంది,చావు కబురు చల్లగా, మర్డర్, వైరస్ వంటి మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X