అపుడు...హీరో శ్రీకాంత్ సూసైడ్ ఆత్మహత్యా ప్రయత్నం!
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో హీరో శ్రీకాంత్ గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగిన వారిలో ఆయన కూడా ఒకరు. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ విలన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
రక్షాబంధన్ సందర్భంగా శ్రీకాంత్ సోదరి నిర్మల అతని గురించిన ఓ ఆసక్తికర మైన విషయం చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుండే శ్రీకాంత్ కు సినిమాలంటే పిచ్చి ఉండేదని, నటుడిగా తనను తాను నిరూపించుకోవాలని తహతహలాడే వాడని, ఈ క్రమంలో చదువును నిర్లక్ష్యం చేయడంతో శ్రీకాంత్ తండ్రి మందలించడంతో మనస్థాపం చెందిన కాలువలో దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసాడట. ఆ తర్వాత అతన్ని ఇష్ట ప్రకారం సినిమా పరిశ్రమలోకి వెళ్లడానికి శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారట.

ప్రస్తుతం శ్రీకాంత్ పరిశ్రమలోని ప్రముఖుల్లో ఒకరు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే...మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూ రాణిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో ముఖ్యమైన పాత్ర చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











