'ఆపరేషన్ 2019'.. ఏ రాజకీయ పార్టీని టార్గెట్ చేయలేదు.. హీరో శ్రీకాంత్!

శ్రీకాంత్ హీరోగా నటించిన ఆపరేషన్ దుర్యోధన ప్రస్తుతం ఉన్న రాజకీయాలపై విమర్శనాత్మక చిత్రంగా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో శ్రీకాంత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో విలక్షణ నటన కనబరిచారు. పోసాని దర్శత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆ తరహాలో ఇప్పుడు ఆపరేషన్ 2019 చిత్రం రాబోతోంది. డిసెంబర్ 1 న విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో శ్రీకాంత్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సునీల్, మనోజ్ కీలక పాత్రల్లో

సునీల్, మనోజ్ కీలక పాత్రల్లో

ఈ చిత్రంలో సునీల్, హీరో మనోజ్ ప్రత్యేకమైన పాత్రల్లో నటించినట్లు తెలుస్తోంది. అడగగానే ఈ చిత్రంలో నటించేందుకు వారిద్దరూ అంగీకరించారని శ్రీకాంత్ ధన్యవాదాలు తెలిపాడు. అందరి నటీనటుల నుంచి సహకారం అందడం వలనే అనుకున్న సమయం కంటే ముందుగానే ఈ చిత్రాన్ని విడుదల చేయగలుగుతున్నాం అని శ్రీకాంత్ తెలిపాడు.

రాజకీయ పార్టీలని

రాజకీయ పార్టీలని

ఈ చిత్రంలో పొలిటికల్ టచ్ ఉంటుందని శ్రీకాంత్ అన్నారు. కానీ ఏ రాజకీయ పార్టీని కానీ, నాయకుడిని కానీ టార్గెట్ చేయలేదని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం రాజకీయం ఎలా ఉంది, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలా ఉన్నారు, జనాలు ఎలా అలోచించి ఓటేయాలి అంటే అంశాలని ఈ చిత్రంలో చూపించినట్లు శ్రీకాంత్ తెలిపారు. ఈ ఈవెంట్ కు ఎంపీ మురళి మోహన్ అతిథిగా హాజరయ్యారు. రాజకీయ నాయకులని ఈ చిత్రంలో టార్గెట్ చేయలేదు సర్ అంటూ శ్రీకాంత్ సరదాగా వ్యాఖ్యానించాడు.

బిగ్‌బాస్ హరితేజ

బిగ్‌బాస్ హరితేజ

హరితేజ బిగ్ బాస్ తొలి సీజన్ తో సెలేబ్రిటిగా మారిపోయింది. ఈ చిత్రంలో ఆమె ఓ సాంగ్ చేశారని శ్రీకాంత్ తెలిపాడు. ఆమె అంత బాగా చేస్తుందని మేము ఊహించలేదని శ్రీకాంత్ తెలిపాడు. ఈ చిత్రాన్ని 2019 లో విడుదల చేద్దాం అని భావించాం. కానీ నిర్మాతల సహకారంతో ముందుగానే వస్తున్నాం అని శ్రీకాంత్ తెలిపాడు.

తెలంగాణ ఎన్నికలు

తెలంగాణ ఎన్నికలు

ఈ చిత్రం రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించాం. ఇప్పుడు తెలంగాణలో కూడా ఎన్నికల వాతావరణం నెలకొని ఉంది. సినిమా విడుదలకు ఇదే మంచి సమయం అని భావించాం అని శ్రీకాంత్ తెలిపారు. ఈ చిత్రం విజయం సాధిస్తుందనే పూర్తి విశ్వాసంలో తాము ఉన్నట్లు శ్రీకాంత్ తెలిపాడు. కారణం బాబ్జి దర్శత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని టి అలివేలు నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X