శ్రీనివాస్‌రెడ్డి కూతురు అరుదైన ఘనత.. నెల వయసులోనే..
అటు కమెడియన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకొంటూనే ఇటు హీరోగా కూడా వెండితెరపై రాణిస్తున్నారు శ్రీనివాస్‌రెడ్డి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా జంబ లకిడి పంబ. ఈ చిత్రంలో తన కూతురుతో ఆయన కలిసి నటించారు.
అటు కమెడియన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకొంటూనే ఇటు హీరోగా కూడా వెండితెరపై రాణిస్తున్నారు శ్రీనివాస్‌రెడ్డి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా జంబ లకిడి పంబ. ఈ చిత్రంలో తన కూతురుతో ఆయన కలిసి నటించారు. ఈ చిత్రానికి రవి, జోజో జోష్, శ్రీనివాస్‌రెడ్డి ఎన్ నిర్మాతలుగా బీ సురేష్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

జంబ లకిడి పంబలో నటించి.
పులి కడుపున పులిబిడ్డే పుడుతుంది అనే సామెత కరెక్టే అని నిరూపించింది నటుడు శ్రీనివాస్‌రెడ్డి కూతురు. నెల రోజుల క్రితం శ్రీనివాస్‌రెడ్డికి ఓ కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. పుట్టిన ఒకనెలకే జంబలకిడి పంబ సినిమాలో నటించి చిన్నారి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తిది. ఈ సందర్భంగా హీరో శ్రీనివాస్‌రెడ్డి తన ఆనందాన్ని మీడియాతో పంచుకొన్నారు.
Recommended Video


థ్రిల్‌గా ఫీలైన శ్రీనివాస్‌రెడ్డి
తన కూతురితో నటించే విషయంపై థ్రిల్‌గా ఫీలయైన శ్రీనివాస్‌రెడ్డి తన సంతోషాన్ని పంచుకొన్నారు. జంబలకిడి పంబ చిత్రం చిత్రీకరణపరంగా అద్భుతంగా వస్తున్నది. ఈ చిత్రం సూపర్ హిట్ కావడం తథ్యం అనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

టాలీవుడ్‌లో అరుదైన ఘటన
టాలీవుడ్‌లో ఓ నటుడికి సంబంధించిన నెలల సంతానం నటించడం అరుదైన సంఘటన అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఏ సందర్భంగా చిన్నారిని నటింపజేశారనే విషయాన్ని చిత్ర యూనిట్ గోప్యంగా ఉంచింది. ఈ ఆసక్తికరమైన విషయాన్ని తెరపైనే చూడాలనే ఉత్సుకతను చిత్ర యూనిట్ పెంపొందించింది.

ఉత్తమ కామెడీ చిత్రంగా
శ్రీనివాస్‌రెడ్డి నటిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ పరిసరప్రాంతంలో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. చిత్ర దర్శకుడు జేబీ మురళీకృష్ణ మాట్లాడుతూ.. ఈ చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా రూపొందుతున్నది. 2018లో ఉత్తమ కామెడీ చిత్రంగా నిలుస్తుంది అని అన్నారు.

నటీనటులు
జంబలకిడి పంబ చిత్రంలో శ్రీనివాసరెడ్డి సరసన సిద్ధి ఇదనాని జతకట్టింది. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, ధన్‌రాజ్, శకలక శంకర్, హిమజ, రాజ్యలక్ష్మి, హరితేజ తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక వర్గం
శివమ్ సెల్యూలాయిడ్ బ్యానర్ అండ్ మెయిలైన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్, రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా, గోపిసుందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











