కేటీఆర్‌ని ఆశ్చర్యపరిచిన నటుడు సుబ్బరాజ్.. మంచి మనసుతో!
విలన్ పాత్రలు, క్యారెక్టర్ రోల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిజీ నటుడిగా టాలీవుడ్ లో సుబ్బరాజ్ దూసుకుపోతున్నాడు. తాజగా జరిగిన ఓ ప్రయివేట్ కార్యక్రమంలో సుబ్బరాజ్ మంత్రి కేటీఆర్ ని సైతం ఆశ్చర్యపరిచాడు. ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు కేటీఆర్ హాజరయ్యారు. అదే కార్యక్రమంలో సుబ్బరాజ్ కూడా ఉన్నారు.

కేటీఆర్ ని కలసిన సుబ్బరాజ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కొంత మొత్తాన్ని చెక్ రూపంలో అందించారు. సుబ్బరాజ్ చర్యకు ఆశ్చర్యపోయిన కేటీఆర్ అతడిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. సుబ్బరాజ్ ఎంతో మంచి మనసుతో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం చెక్ అందించారని కేటీఆర్ అన్నారు.
సుబ్బరాజ్ బాహుబలి 2 చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తేలింది. ఈ చిత్రంతో సుబ్బరాజ్ గుర్తింపు మరింతగా పెరిగింది. విలన్ గా సుబ్బరాజ్ పలు చిత్రాల్లో సత్తా చాటాడు.


Click it and Unblock the Notifications











