For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాగార్జున లేకపోతే రెండుసార్లు చనిపోయేదాన్ని.. అలా చేసి ఉంటే ఉదయ్ కిరణ్ బతికేవాడు.. నటి సుధ

By Rajababu
|

వైవిధ్యమైన పాత్రలు పోషించగల యాక్టర్‌గా సీనియర్ నటి సుధ టాలీవుడ్‌లో మంచి పేరుంది. గ్యాంగ్ లీడర్, ఆమె లాంటి చిత్రాల్లో ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఆమెను టాలీవుడ్ అమ్మ అంటే అతిశయోక్తి కాదేమో. 40 ఏళ్లపాటు సినీ రంగానికి సుధ సేవ అందించినప్పటికీ.. పలు కారణాల వల్ల మీడియాకు చాలా దూరంగా ఉంటారు. కానీ ఇటీవల ఓ యూట్యూబ్ చానెలకిచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన విశేషాలను వెల్లడించారు.

ఆయన సలహా మేరకే..

ఆయన సలహా మేరకే..

ప్రముఖ దర్శకుడు బాలచందర్ చిత్రాలతో హీరోయిన్‌గా సినీ ప్రయాణం ప్రారంభించాను. ఆ సమయంలో నేను నటించిన సినిమాలు ఫ్లాఫ్ కావడంతో బ్రేక్ ఏర్పడింది. అయితే ఒకరోజు బాలచందర్ వచ్చి హీరోయిన్‌గా స్థిరపడేందుకు కావాల్సిన అంశాలు లేవు. నీవు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారితే ఎక్కువ కాలం పరిశ్రమలో ఉంటావు అని ఇచ్చిన సలహాతో అమ్మ, వదిన, అక్క పాత్రలు ధరించడం ప్రారంభించాను అని సుధ తెలిపారు.

తెలుగు అలా నేర్చుకొన్నాను..

తెలుగు అలా నేర్చుకొన్నాను..

గ్యాంగ్ లీడర్ చిత్రం తర్వాత తెలుగులో చాలా బిజీ అయ్యాను. ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడే తెలుగు బాగా నేర్చుకొన్నాను. సినీ పరిశ్రమలో నాకు నాగార్జున, చిరంజీవి ఫ్యామిలీలతో మంచి అనుబంధం ఉంది. జగపతిబాబు అంటే కూడా నాకు చాలా ఇష్టం అని సుధ వెల్లడించారు.

నాగార్జున కాపాడారు..

నాగార్జున కాపాడారు..

ఈ రోజు సుధ ఇంకా బతికి ఉన్నారంటే కారణం నాగార్జున గారు. అపెండిసైటిస్‌తో బాధపడుతూ సృహతప్పి పడిపోతే నాగార్జున హాస్పిటల్‌కు పంపించి ఆపరేషన్ చేయించాడు. లేకపోతే నేను బతికి ఉండేదాన్ని కాదు. ఇంకా భూమ్మిద ఉన్నానంటే కారణం నాగార్జున గారు మాత్రమే అని సుధ పేర్కొన్నారు. అందుకే నాగార్జున అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు.

గాయపడినప్పుడు..

గాయపడినప్పుడు..

మరోసారి రావోయి చందమామ సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడ్డాను. శరీరంలో భాగం పనిచేయని పరిస్థితి ఏర్పడింది. దాంతో బెడ్ పైన పడుకోబెట్టారు. వెంటనే నాగార్జున స్పందించి తన పర్సనల్ డాక్టర్ పిలిపించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

చాలా మందికి తల్లిగా..

చాలా మందికి తల్లిగా..

చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణతోపాటు యువ హీరోలతో నటించాను. మలయాళంలో నా కంటే 10 ఏళ్లు తక్కువ వయస్సు ఉన్న మోహన్ లాల్, మమ్ముట్టికి తల్లిగా నటించాను. కన్నడంలో రామ్ కుమార్‌కు తల్లిగా నటించాను. ఇప్పటివరకు దాదాపు 750 చిత్రాల్లో నటించాను అని తెలిపారు.

వారి మరణాన్ని తట్టుకోలేకపోయాను..

వారి మరణాన్ని తట్టుకోలేకపోయాను..

సినీ పరిశ్రమలో నాకు నచ్చిన కొందరు వ్యక్తుల ఆకస్మిక మృతితో తాను దిగ్బ్రాంతికి గురయ్యాను. ఆ విషాదం నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది. బాలచందర్, సౌందర్య, ఉదయ్ కిరణ్, శ్రీహరి లాంటి వ్యక్తుల వరుస మరణాలతో కుంగిపోయాను. అందరిలో నేను మరిచిపోలేనిది బాలచందర్, ఉదయ్ కిరణ్. తండ్రి, గురువు, దేవుడు లాంటి బాలచందర్‌, కొడుకు లాంటి ఉదయ్ కిరణ్ మరణం చాలా విషాదం నింపింది అని కన్నీరుమున్నీరయ్యారు. రజనీకాంత్ కూడా కంటతడి పెట్టాడంటే ఆయన ఎంతటి ఉన్నతమైన వ్యక్తి మీకు తెలుస్తుంది.

ఉదయ్ కిరణ్ మరణం..

ఉదయ్ కిరణ్ మరణం..

ఉదయ్ కిరణ్ మరణించిన విషయం నాకు తెలియదు. ఒక లైలా కోసం షూటింగ్ కోసం శంషాబాద్‌కు వెళ్లాను. అప్పుడు హీరో నాగార్జున ప్రొడక్షన్ వారికి ఫోన్ చేసి సుధను పంపించండి. కానీ ఉదయ్ కిరణ్ విషయం చెప్పకండి చెప్పినా వారు ఆ విషయాన్ని దాచకలేకోయారు అని సుధ చెప్పారు. నేను తట్టుకోలేనని వారు నన్ను అక్కడికి పంపించలేదు అని చెప్పారు.

ఎందుకు చనిపోయావురా..

ఎందుకు చనిపోయావురా..

ఉదయ్ కిరణ్ సంతాప సభలో నువ్వెందుకు చావాలనుకొన్నావు అని గట్టిగా అరిచాను. కష్టాలు అందరికీ వస్తాయి. వాటిని అధిగమించినప్పుడే జీవితం అని సుధ ఉద్వేగానికి లోనయ్యారు. శ్రీహరి, ఉదయ్ కిరణ్ మరణం తర్వాత ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి చాలా రోజులు పట్టింది అని అన్నారు.

మనతో ఉంటే బతికేవాడు..

మనతో ఉంటే బతికేవాడు..

నన్ను ఉదయ్ కిరణ్ అమ్మా అని పిలిచేవాడు. నా కూతురు వాడితో ఆడుకొనేది. ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత నా కూతురు ఫోన్ చేసి మనతో ఉంటే చనిపోయేవాడు కాదు కదా అని నాతో అన్నది.

ఒకరోజు మేము షూటింగ్‌లో ఉండగా వచ్చి ఉదయ్ కిరణ్ మోకాళ్లపై కూర్చొని బాగా ఏడ్చాడు. అప్పటికే పెళ్లి ఆగిపోయింది. తల్లి చనిపోయి చాలా బాధలో ఉన్నాడు. వాడిని దత్తత తీసుకొని ఉంటే బతికి ఉండేవాడు అని సుధ ఉద్వేగానికి లోనయ్యింది.

English summary
Senior Actress Sudha known for Mother characters in tollywood. She acted as mother for many tollywood big stars. Sudha Said that Actor Nagarjuna family is very close to her. she expressed grief over Uday Kiran, and director Balachander's death.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more