twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘‘అనుష్కతో ఆ సీన్ ఉందంటేనే ఒప్పుకున్నా... దర్శకుడు మోసం చేశాడు’’

    |

    అనుష్క టైటిల్ రోల్‌లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'రుద్రమదేవి'లో ప్రముఖ నటుడు సుమన్ విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సుమన్ తెలుగులో విలన్ పాత్ర చేయడం అదే తొలిసారి. అప్పట్లో ఈ సినిమాకు సంబంధించిన పేమెంట్ విషయంలో గుణశేఖర్ మీద సుమన్ చెక్ బౌన్స్ కేసు వేయడం చర్చనీయాంశం అయింది.

    తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుమన్ 'రుద్రమదేవి' వివాదం గురించి స్పందించారు. గుణశేఖర్ తనను ఈ సినిమాకు ఒప్పించే విషయంలో ఎలా మోసం చేశాడు? పేమెంట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులకు గురి చేశాడో వెల్లడించారు.

    అనుష్కతో ఆ సీన్ ఉందంటేనే ఒప్పుకున్నా

    అనుష్కతో ఆ సీన్ ఉందంటేనే ఒప్పుకున్నా

    ‘‘రుద్రమదేవి సినిమా ద్వారా తొలిసారి తెలుగులో విలన్ క్యారెక్టర్ చేశాను. విలన్ క్యారెక్టర్ అని చెప్పడంతో పాటు క్లైమాక్స్‌లో అనుష్కతో నాకు ఫైట్ సీన్ ఉంటుందని చెప్పి గుణశేఖర్ నన్ను ఒప్పించాడు. ఈ విషయం అనుష్కగారి ముందే గుణశేఖర్ చెప్పి నాతో ఓకే చేయించాడు. నేను కూడా అందుకు తగిన విధంగానే నేను ప్రిపేర్ అయ్యాను.'' అని సుమన్ గుర్తు చేసుకున్నారు.

    డబ్బు విషయం పట్టించుకోలేదు

    డబ్బు విషయం పట్టించుకోలేదు

    తొలిసారి తెలుగులో విలన్ రోల్, అందులోనూ అనుష్కతో ఫైట్ అని చెప్పడంతో నా కెరీర్‌కు ప్లస్సవుతుందని ఒప్పుకున్నాను. డబ్బు విషయం పట్టించుకోలేదు. అతడు ఏ అమౌంట్ ఇస్తానని చెప్పాడో అంత మొత్తానికే చేయడానికి ఒప్పుకున్నట్లు సుమన్ తెలిపారు. పేమెంట్ విషయంలో కూడా ముందే ఇవ్వమని ఒత్తిడి చేయలేదు. అతడు చెప్పిన సమయానికి తీసుకోవడానికి అంగీకరించినట్లు తెలిపారు.

    చాలా సినిమాలు వదులుకున్నాను

    చాలా సినిమాలు వదులుకున్నాను

    ‘రుద్రమదేవి'లో తొలిసారిగా విలన్ పాత్ర కావడంతో.... కమిట్మెంటుతో ఉన్నాను. వేరే సినిమాలు కూడా వదులుకున్నాను. పలు సందర్భాల్లో షూటింగ్స్ షెడ్యూల్స్ కేన్సిల్ చేసినా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా వారికి అదనంగా డేట్స్ కేటాయించినట్లు సుమన్ వెల్లడించారు.

    పేమెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు

    పేమెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు

    నాకు ఇస్తానని చెప్పిన సమయానికి పేమెంట్ ఇవ్వలేదు. తర్వాత ఇస్తానంటూ వాయిదా వేయడం మొదలు పెట్టారు. ఈ విషయాలకు నేను ఎప్పుడూ బాధ పడలేదు. కానీ క్లైమాక్సులో అనుష్కతో ఫైట్ సీన్ ఉందని చెప్పి ఆఖరికి నాకు ఫైట్ సీన్ ఇవ్వలేదు. దీంతో నాకు చాలా కోపం వచ్చింది. అందుకే నా డబ్బు నాకు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినట్లు సుమన్ గుర్తు చేసుకున్నారు.

    డబ్బు రాక, పేరు రాక మోస పోయాను

    డబ్బు రాక, పేరు రాక మోస పోయాను

    మనం ఒక సినిమాకు పని చేస్తున్నామంటే డబ్బు కోసం లేదా.. మనం చేసే పాత్ర ద్వారా మంచి పేరు వస్తుందని చేస్తాం. కానీ ఇక్కడ డబ్బు రాక, పేరు రాక మోస పోయాను. అందుకే అతడి మీద చెక్ బౌన్స్ కేసు వేశాను. నేను కోర్టుకు వెళ్లను అనుకున్నారు.. నాకు ఇంత మోసం జరిగిన తర్వాత వెళ్లకుండా ఎలా ఉంటాను. అందుకే నాకు రావాల్సిన డబ్బు కోర్టుకు వెళ్లి అతడి నుంచి రాబట్టడం జరిగిని తెలిపారు.

    ఆ సీన్ ఉంటే డబ్బు వదులుకునే వాడిని

    ఆ సీన్ ఉంటే డబ్బు వదులుకునే వాడిని

    గుణశేఖర్ నాకు ముందుగా చెప్పినట్లు క్లైమాక్స్‌లో అనుష్క‌తో ఫైట్ సీన్ పెట్టి ఉంటే ఆ డబ్బు నేను వదులుకునే వాడిని. అలా చేయకుండా నేను పోషించిన విలన్ క్యారెక్టర్ దెబ్బతీయడంతో నాకు కోపం వచ్చి డబ్బుకోసం కోర్టుకు వెళ్లాను. నాకు రావాల్సిన రూ. 10 లక్షలు రాబట్టుకున్నట్లు సుమన్ తెలిపారు.

    English summary
    Actor Suman Reveals The Story Behind Cheque Bounce Case Against Director Gunasekhar. Suman is an Indian film actor known for his work predominantly in Telugu cinema. He was one of the most prominent stars of Telugu cinema during the 1980s.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X