బాహుబలిలో ప్రభాస్ అసలైన హీరో కాదు.. అలా చూపించాలంటే గట్స్ ఉండాలి.. సుమన్!

ప్రముఖ నటుడు సుమన్ 90లలో హీరోనా సక్సెస్ అయ్యారు. రజనీకాంత్ శివాజీ చిత్రంలో విలన్ గా కొత్త అవతారం ఎత్తారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. సుమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి బాహుబలి చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి ప్రశంసలతో ముంచెత్తారు. బాహుబలిలో ప్రభాస్, రానా పాత్రలని పోల్చుతూ సుమన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..

 తెలుగు సినిమా ఖ్యాతి

తెలుగు సినిమా ఖ్యాతి

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన చిత్రం బాహుబలి. రాజమౌళికి, ప్రభాస్ కు దేశవ్యాప్తంగా తిరుగులేని స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. హై బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం వసూళ్ల సునామి సృష్టించి ఇండియాలోనే నెం 1 చిత్రంగా నిలిచింది. రానా ప్రతినాయకుడిగా నటించినప్పటికీ ప్రశంసలు అందుకున్నాడు. అలాంటి పాత్రని తాను మాత్రమే చేయగలనని నిరూపించుకున్నాడు.

ప్రభాస్ హీరో కాదు

ప్రభాస్ హీరో కాదు

తాజాగా నటుడు సుమన్ మాట్లాడుతూ.. బాహుబలి చిత్రంలో ప్రభాస్ అసలైన హీరో కాదని అన్నారు. మీరు గమనించినట్లైతే.. భీకర పోరు తర్వాత హీరో విలన్ ని చంపాడు. రానా పాత్ర మంటల్లో కాలిపోతుంది. దీనిని బట్టే అర్థం అవుతుంది.. ఈ చిత్రంలో రానా పాత్ర చాలా పవర్ ఫుల్ అని. ఇలాంటి సీన్స్ తీయాలంటే గట్స్ ఉండాలి. అది కేవలం రాజమౌళికి మాత్రమే సాధ్యం అని సుమన్ అన్నారు.

 40 మందిని కొట్టడం

40 మందిని కొట్టడం

40 మందిని కొట్టడపెద్ద విషయం కాదు. కానీ విలన్ పాత్రని అంత పవర్ ఫుల్ గా చూపించాలంటే దర్శకుడుకి విజన్ కావాలని సుమన్ తెలిపారు. బాహుబలి చిత్రంలో విలన్ పాత్ర పవర్ ఫుల్ గా ఉండడం వలనే అంత పెద్ద విజయం సాధించిందని తెలిపారు. సినిమాలో ప్రతినాయకుడి పాత్ర వీక్ గా ఉంటే ఆ సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో చెప్పలేం అని సుమన్ అన్నారు.

రాజకీయాలపై

రాజకీయాలపై

సుమన్ ప్రస్తుతం సౌత్ లో బిజీ ఆర్టిస్ట్ గా కోనసాగుతున్నారు. కొంత కాలం నుంచి ఆయన ద్రుష్టి రాజకీయాలపై కూడా పడింది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులని గమనిస్తున్న సుమన్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నారు. కాలం కలసి వస్తే రాబోవు సార్వత్రిక ఎన్నికల్లోనే సుమన్ తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X