కేసీఆర్ ఫిల్మ్‌సిటీ ఐడియా అదిరింది : సుమన్ పొగడ్తలు

By Bojja Kumar

Actor Suman Praises KCR
హైదరాబాద్ లోనే తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ది చెందేలా చర్యలు తీసుకుంటున్న తెలంగాణ ముఖ్య మంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ప్రముఖ సినీ నటుడు సుమన్ అభినందనలు తెలిపారు. రెండు వేల ఎకరాల్లో అన్ని సదుపాయాలతో ఫిల్మ్ సిటీ నిర్మించే ఆలోచన పట్ల సుమన్ హర్షం వ్యక్తం చేసారు.

దీని వల్ల వేలాది మంది కార్మికులకు ఉపాధి లభిస్తుందని, ప్రపంచ సినిమాకు హైదరాబాద్ ప్రధాన కేంద్ర కావాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దిశలో ఉన్నాయని అన్నారు. ఇప్పటికే అన్ని భారతీయ భాషా చిత్రాల నిర్మాణం హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే భవిష్యత్తులో ఇది మరింత పెరుగుతుంది అన్నారు. సినిమా నిర్మాణానికి కావాల్సిన సాంకేతిక శక్తి హైదరాబాద్ లో అందుబాటులో ఉందని సుమన్ పేర్కొన్నారు.

కేసీఆర్ ఏమన్నారంటే..
ఎవరెటుపోయినా టాలీవుడ్‌ మాత్రం హైదరాబాద్‌ని వీడకుండా చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఎన్ని స్టూడియోలున్నా, ఎన్నెన్ని వసతులున్నా మరిన్ని వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీని నిలబెట్టడానికి తెలంగాణలో ఫిల్మ్ సిటీ నిర్మించేందుకు కసరత్తులు చేస్తున్నామన్నారు.

అన్నపూర్ణ, పద్మాలయ, రామానాయుడు లాంటి ఫేమస్ స్టూడియోలు హైదరాబాద్‌ నగరంలో ఫిల్మ్‌ ఇండస్ట్రీకి ప్రాణం పోస్తున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సినిమా స్టూడియో ఇక్కడి సినిమా అవసరాలు తీరుస్తోంది. సినిమా నిర్మాణానికి ఇంతటి వసతులు కలిగిన హైదరాబాద్‌ నుంచి రాష్ట్రం విడిపోగానే ఇండస్ట్రీ అంతా తట్టాబుట్టా సర్దేస్తుందనుకున్నారు. కానీ కేసీఆర్‌ తనదైన రీతిలో సినీ పరిశ్రమను నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు.

సినీ పరిశ్రమ ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ నుంచి తరలిపోకుండా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికావాలని అందు కోసం రెండు వేల ఎకరాల్లో ఫిల్మ్ సిటీని నిర్మించాలని ఆదేశించారు. సినీ పరిశ్రమ ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ నుంచి తరలిపోదని కేసీఆర్ అన్నారు. ఇంత మంచి వాతావరణం ఉన్న నగరం ఎక్కడా దొరకదని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో సినిమా షూటింగ్‌లు, సీరియళ్ల నిర్మాణం ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా సినిమా సిటీని నిర్మించాలని అధికారులకు సూచించారు. గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ లాంటి సాంకేతిక స్టూడియోలు సినిమా సిటీలో ఉండేలా చూడాలని పేర్కొన్నారు.

సుమన్ సినిమా కెరీర్ విషయానికొస్తే...
ఇప్పటి వరకు దక్షిణాది చిత్రాల్లో నటించిన ఆయన అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న 'గబ్బర్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంజయ్ లీలా బన్సాలీ రూపొందిస్తున్నారు. తమిళ చిత్రం 'రమణ'(తెలుగులో ఠాగూర్) చిత్రాన్ని హిందీలో 'గబ్బర్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. 'వేదం', 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రాలకు దర్శకత్వం వహించిన తెలుగు దర్శకుడు క్రిష్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హబీబ్ ఖాన్ ఈచిత్రానికి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

'శివాజీ' చిత్రం తర్వాత చాలా అవకాశాలు వచ్చినప్పటికీ చిత్రాల ఎంపికలో జాగ్రత్తగా ఉన్నట్లు సుమన్ చెప్పారు. 'గబ్బర్'లో నన్ను రికమండ్ చేసింది అక్షయ్ కుమార్. ఆయనకు ఈ సందర్భంగా కృజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాలీవుడ్ తెరంగ్రేటం ఆలస్యమైనప్పటికీ ఒక మంచి సినిమా ద్వారా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఇది నా కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు సుమన్ .

హిందీ చిత్రాల్లో అవకాశం వచ్చినప్పటికీ అన్ని భాషల చిత్రాల్లో నటిస్తాను అని సుమన్ పేర్కొన్నారు. త్వరలో హాలీవుడ్ సినిమాలో కూడా నటించబోతున్నాను. త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తాను అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X